PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp056706b8-420f-4df5-b822-f75ec9eb8579-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp056706b8-420f-4df5-b822-f75ec9eb8579-415x250-IndiaHerald.jpg దీంతో ఇతర పార్టీల నుంచి నాయకులు వల‌సల మీద ఆశగా ఎదురుచూస్తోంది. పైగా ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి ఇప్పుడు ఎంపీగా కూడా ఉన్నారు. ఆమెకు కేంద్రంలో మరింత మంచి పరిచయాలతో పాటు మరింత స్ట్రాంగ్ అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే అధికారంలో మూడు పార్టీలు ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం - జనసేన నాయకులు ఎవరు కూడా ఆ పార్టీలను వదిలి బిజెపిలోకి వెళ్లి అవకాశం లేదు. ycp{#}YCPవైసీపీని నాశ‌నం చేసే ప‌ని మొద‌లు పెట్టిన చిన్న‌మ్మ‌... జ‌గ‌న్‌కు సినిమా...!వైసీపీని నాశ‌నం చేసే ప‌ని మొద‌లు పెట్టిన చిన్న‌మ్మ‌... జ‌గ‌న్‌కు సినిమా...!ycp{#}YCPMon, 26 Aug 2024 14:22:28 GMTఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవడానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం బాగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ బిజెపి అధికార పక్షంలో ఉంది. దీంతో ఇతర పార్టీల నుంచి నాయకులు వల‌సల మీద ఆశగా ఎదురుచూస్తోంది. పైగా ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి ఇప్పుడు ఎంపీగా కూడా ఉన్నారు. ఆమెకు కేంద్రంలో మరింత మంచి పరిచయాలతో పాటు మరింత స్ట్రాంగ్ అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే అధికారంలో మూడు పార్టీలు ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం - జనసేన నాయకులు ఎవరు కూడా ఆ పార్టీలను వదిలి బిజెపిలోకి వెళ్లి అవకాశం లేదు.


బిజెపి కూడా మిత్ర ధర్మాన్ని పాటించాలి మిత్ర ధర్మన్న పాటిస్తూ కూటమిలోని ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకునేది లేదని ఇప్పటికే దగ్గుబాటి పురందేశ్వరి ప్రకటించారు. అదే సమయంలో పురందేశ్వరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి రెడ్ కార్పెట్ వేస్తున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి వచ్చే వైసీపీ వారిని మాత్రం తాము తమ పార్టీలో చేర్చుకుంటామని అలాగని బిజెపిని పున‌రావాస కేంద్రంగా మార్చబోయేది లేదని కూడా స్పష్టం చేశారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని అంటున్న పార్టీ ఈసారి కనీసం లక్ష సభ్యత్వాలు పెరగాలని టార్గెట్ పెట్టుకుంది.


మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వలసల పై వారు ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. తమ పార్టీ సిద్ధాంతాలు న‌చ్చి వచ్చే నాయకులను మాత్రమే చేర్చుకుంటాం అంటూ పురందరేశ్వరి చెబుతున్నా నిజానికి వైసీపీ నుంచి ఎవరు వచ్చినా సరే చేర్చుకునే స్థితిలో బిజెపి వందన్న మాట నిజం. తెలుగుదేశం - జనసేన పార్టీలోకి ఎంట్రీ అవకాశం లేని వైసిపి నాయకులు బిజెపిలోకి వెళ్లే ఆలోచనతో ఉన్నారు. ఏదేమైనా చిన్న‌మ్మ వైసీపీ నేత‌ల‌ను టార్గెట్ చేస్తే జ‌గ‌న్ కు ప‌ట్ట‌ప‌గ‌లే సినిమా క‌న‌ప‌డుతుంది. ఈ క్రమంలోనే తమ పార్టీని విస్తరించుకోవాలని పురందరేశ్వరి ప్రణాళికలు రచిస్తున్నారు .. మరి ఈ విషయంలో ఆమె ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>