PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/raghurama-krishn-rajua896c312-56fe-4da6-8163-225629e892ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/raghurama-krishn-rajua896c312-56fe-4da6-8163-225629e892ce-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. జగన్మోహన్ రెడ్డి పైన ఐదు సంవత్సరాలు పాటు పోరాటం చేసిన రఘురామకృష్ణ రాజుకు... తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ప్రాధాన్యత కనిపించడం లేదని సమాచారం. రఘురామకృష్ణ రాజుకు సంబంధించిన అనుచరులు అలాగే.. ఆయన ఫ్యాన్స్ కూడా ఇదే విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారట. raghurama krishn raju{#}Jagan;MP;krishna;Telugu Desam Party;Reddy;king;CBN;Ministerచంద్రబాబు : టీడీపీపై రఘురామ తిరుగుబాటు ?చంద్రబాబు : టీడీపీపై రఘురామ తిరుగుబాటు ?raghurama krishn raju{#}Jagan;MP;krishna;Telugu Desam Party;Reddy;king;CBN;MinisterMon, 26 Aug 2024 13:41:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. జగన్మోహన్ రెడ్డి పైన ఐదు సంవత్సరాలు పాటు పోరాటం చేసిన రఘురామకృష్ణ రాజుకు... తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ప్రాధాన్యత కనిపించడం లేదని సమాచారం. రఘురామకృష్ణ రాజుకు సంబంధించిన అనుచరులు అలాగే.. ఆయన ఫ్యాన్స్ కూడా ఇదే విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారట.

 ఐదు సంవత్సరాల పాటు జగన్ పార్టీలోనే ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా అనేక కేసులు వేశారు రఘురామకృష్ణరాజు. దీనికి ఫలితంగా జగన్ కూడా రఘురామరాజు కు చుక్కలు చూపించారు.  రహస్యంగా రఘురామకృష్ణ రాజును అరెస్టు చేసి దారుణంగా కొట్టించాలని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు కూడా వచ్చాయి. దానికి సంబంధించిన ఫోటోలను కూడా రఘురామకృష్ణరాజు... బయటపెట్టి జగన్ మోహన్ రెడ్డికి షాక్ కూడా ఇచ్చారు.

 ఆ సమయంలో మంచి సింపతి కూడా సంపాదించుకోగలిగారు రఘురామకృష్ణ రాజు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఓడిపోవడానికి.. రఘురామకృష్ణరాజు చేయని పని లేదు. అయితే అలాంటి రఘురామకృష్ణ రాజుకు ఎంపీ టికెట్ ఇస్తారని... భావించగా కూటమి ఆయనకు అన్యాయమే చేసింది.  కానీ ఆ తర్వాత టిడిపిలో చేరి ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు రఘురామకృష్ణ రాజు.

 అయితే ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామకృష్ణరాజు... మంత్రిగా బాధ్యతలు తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఆయనను అస్సలు కనికరించలేదు. మంత్రి పదవి రాలేదు కదా స్పీకర్ వస్తుందని కూడా కొంతమంది ప్రచారం చేశారు. అది కూడా రాలేదు. ఇక టిటిడి చైర్మన్ పదవి కూడా వచ్చేలా కనిపించడం లేదని సమాచారం. నామినేటెడ్ పోస్ట్ అయిన రఘురామకృష్ణ రాజుకు వస్తుందని కొంతమంది భావిస్తున్నారు. ఒకవేళ ఆ పదవి రాకపోతే.. చంద్రబాబుపై తిరుగుబాటుకు కూడా రఘురామ కృష్ణ రాజు సిద్ధమవుతారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>