MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pragya79b7e3bd-fec8-40a2-9725-336ea3d5ed44-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pragya79b7e3bd-fec8-40a2-9725-336ea3d5ed44-415x250-IndiaHerald.jpgసినీ పరిశ్రమలోకి చాలా మంది హీరోయిన్స్ ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది కి చాలా తక్కువ కాలంలోనే అద్భుతమైన అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అలాగే కెరియర్ను ప్రారంభించిన రెండు , మూడు సంవత్సరాల లోపల స్టార్ హీరోయిన్స్ అయిన వారు కూడా అనేక మంది ఉన్నారు. ఇక మరి కొంత మంది అందం , అభినయం , నటన అన్ని ఉండి కూడా కెరియర్ను ప్రారంభించిన కొత్తలో అవకాశాలను పెద్దగా దక్కించుకోరు. కానీ కెరియర్ ముందుకు పయనిస్తున్న సమయంలో మంచి అవకాశాలను దక్కించుకుంటూ ఉంటారు. ఇక ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ పPragya{#}boyapati srinu;pragya jaiswal;Bobby;Balakrishna;Blockbuster hit;Josh;Heroine;BEAUTY;Telugu;Hindi;Cinemaఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్లకు వరుస క్రేజీ అవకాశాలు.. స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తుందా..?ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్లకు వరుస క్రేజీ అవకాశాలు.. స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తుందా..?Pragya{#}boyapati srinu;pragya jaiswal;Bobby;Balakrishna;Blockbuster hit;Josh;Heroine;BEAUTY;Telugu;Hindi;CinemaSun, 25 Aug 2024 13:15:00 GMTసినీ పరిశ్రమలోకి చాలా మంది హీరోయిన్స్ ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది కి చాలా తక్కువ కాలంలోనే అద్భుతమైన అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అలాగే కెరియర్ను ప్రారంభించిన రెండు , మూడు సంవత్సరాల లోపల స్టార్ హీరోయిన్స్ అయిన వారు కూడా అనేక మంది ఉన్నారు. ఇక మరి కొంత మంది అందం , అభినయం , నటన అన్ని ఉండి కూడా కెరియర్ను ప్రారంభించిన కొత్తలో అవకాశాలను పెద్దగా దక్కించుకోరు. కానీ కెరియర్ ముందుకు పయనిస్తున్న సమయంలో మంచి అవకాశాలను దక్కించుకుంటూ ఉంటారు. ఇక ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

ఈమె సినీ పరిశ్రమలో కెరియర్ను ప్రారంభించి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈమెకు కెరియర్ను ప్రారంభించిన తర్వాత కంచే మూవీ తో మంచి విజయం దక్కింది. ఆ తర్వాత ఈమెకు మంచి విజయాలు దక్కలేదు. ఇక అఖండ మూవీ తో ఈమెకు బ్లాక్ బస్టర్ దక్కింది. ఈ సినిమా తర్వాత కూడా ఈమెకు భారీ అవకాశాలు రాలేదు. ఇక ప్రస్తుతం మాత్రం ఈమె కెరియర్ మంచి జోష్ లో ముందుకు నడుస్తోంది. హిందీ సినిమాలలో నటిస్తూనే తెలుగు సినిమాలలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

అలాగే బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందబోయే అఖండ 2 సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్గా నటించబోతుంది. ఇలా కెరియర్ను ప్రారంభించిన చాలా సంవత్సరాల తర్వాత ఈ బ్యూటీ ఫుల్ బిజీగా ప్రస్తుతం ఉంది. ఇలాగే ఈమె కెరియర్ ముందుకు సాగితే ఈ బ్యూటీ మరి కొంత కాలం లోనే స్టార్ హీరోయిన్లకు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>