MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nnai2e964271-0a99-443b-81c4-7cb9be71fde7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nnai2e964271-0a99-443b-81c4-7cb9be71fde7-415x250-IndiaHerald.jpgనేచురల్ స్టార్ నాని నటించిన కొత్త సినిమా 'సరిపోదా శనివారం' ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాని వివేక్ ఆత్రేయ అనే దర్శకుడు తెరకెక్కించారు. ఇందులో ఎస్‌జే సూర్య, ప్రియాంక మోహన్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. మూవీ రిలీజ్ కు ముందే దీనిపై హైప్స్ పెంచేయడానికి నాని చాలా ప్రయత్నిస్తున్నాడు. మూవీ మేకర్స్ కూడా అనేక ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ చేపడుతున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా బృందం ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు nnai{#}priyanka;vivek;Darsakudu;Manam;Audience;Nani;Dussehra;Vijayadashami;Father;Saturday;Event;Director;Cinemaఇది కలిసొచ్చే కాలమట.. ఆ మూవీపై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?ఇది కలిసొచ్చే కాలమట.. ఆ మూవీపై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?nnai{#}priyanka;vivek;Darsakudu;Manam;Audience;Nani;Dussehra;Vijayadashami;Father;Saturday;Event;Director;CinemaSun, 25 Aug 2024 11:00:00 GMTనేచురల్ స్టార్ నాని నటించిన కొత్త సినిమా 'సరిపోదా శనివారం' ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాని వివేక్ ఆత్రేయ అనే దర్శకుడు తెరకెక్కించారు. ఇందులో ఎస్‌జే సూర్య, ప్రియాంక మోహన్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. మూవీ రిలీజ్ కు ముందే దీనిపై హైప్స్ పెంచేయడానికి నాని చాలా ప్రయత్నిస్తున్నాడు. మూవీ మేకర్స్ కూడా అనేక ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ చేపడుతున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా బృందం ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు

ఆ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ, తన సినిమా బాగా ఆడతుందని చాలా నమ్మకంగా చెప్పాడు. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరి పేరు చెప్పి వారికి ధన్యవాదాలు తెలిపాడు. "ప్రతి ఒక్కరూ నా నుంచి ఇలాంటి సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అవుతారు. ఇది కుటుంబ సభ్యులందరితో కలిసి కూర్చొని చూడాల్సిన సినిమా అని నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమాని చూస్తే అందరూ ఎంజాయ్ చేస్తారు అని నా నమ్మకం. " అని నాని అన్నారు.

"సరిపోదా శనివారం కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే సినిమా అని సామెత స్టైల్లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లందరికీ చెప్పాలనుకుంటున్నాను." అని నాని చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అందరూ ఈ సినిమాని చాలా ఇష్టపడతారనే ఒక వాక్యాన్ని పదేపదే చెప్పారు. "ఇప్పుడు అందరూ సినిమా హాళ్లకు రావడం లేదని అంటున్నారు కానీ, మనం మంచి సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమా హాళ్లకు వస్తారు. ప్రేక్షకులు సినిమాలను ఎప్పుడూ మిస్ అవ్వరు, కానీ మనమే కొన్నిసార్లు ప్రేక్షకులను మిస్ అవుతాము" అని నాని పేర్కొన్నారు. దసరా హాయ్ నాన్న వంటి సినిమాలు తో మంచి హిట్స్ అందుకున్న నాని ఈ మూవీతో కూడా హిట్ అందుకుంటే అతని కెరీర్ గ్రాఫ్ మరింత పెరిగిపోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>