SportsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hardik-pandya-cheated-natasa-netizens-apologize-to-her7a4a53e9-558f-4302-89fe-7b0174573c57-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hardik-pandya-cheated-natasa-netizens-apologize-to-her7a4a53e9-558f-4302-89fe-7b0174573c57-415x250-IndiaHerald.jpgభారత క్రికెటర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరు వివాహానికి ముందే ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు. గత సంవత్సరం అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక ఏడాదిలోపే ఏవో కొన్ని కారణాలతో విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం నటాషా తన కుమారుడిని తీసుకొని సెర్బియాకు వెళ్ళిపోయింది. ప్రస్తుతం నటాషా తన కుమారుడితో కలిసి సెర్బియాలో ఉంటుంది. hardik pandya {#}natasha;Nataša Stanković;Ishtam;media;Hardik Pandya;marriage;Newsషాకింగ్‌: పాండ్యా-న‌టాషా విడాకులకు కుట్రలు చేసింది అతనేనా..?షాకింగ్‌: పాండ్యా-న‌టాషా విడాకులకు కుట్రలు చేసింది అతనేనా..?hardik pandya {#}natasha;Nataša Stanković;Ishtam;media;Hardik Pandya;marriage;NewsSun, 25 Aug 2024 07:49:00 GMT


భారత క్రికెటర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరు వివాహానికి ముందే ఓ మగ బిడ్డకు జన్మనిచ్చారు. గత సంవత్సరం అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఇక ఏడాదిలోపే ఏవో కొన్ని కారణాలతో విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం నటాషా తన కుమారుడిని తీసుకొని సెర్బియాకు వెళ్ళిపోయింది. ప్రస్తుతం నటాషా తన కుమారుడితో కలిసి సెర్బియాలో ఉంటుంది.

విడాకుల అనంతరం హార్దిక్ మరో అమ్మాయితో రిలేషన్ కొనసాగిస్తున్నాడని సోషల్ మీడియాలో అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వీరి విడాకులకు గల కారణాలు ఏంటని చాలామంది ఆరా తీస్తున్నారు. తాజాగా వీరి విడాకుల గల కారణం బయటకు వచ్చింది. నటాషా కన్నా తానే ఎక్కువని హార్దిక్ పాండ్యా భావించడం, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం, గర్వం వంటి కారణాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.


నటాషా ఎంతో బాధగా, అసౌకర్యంగా ఉన్నప్పటికీ సర్దుకుపోయిందట. కానీ తప్పని పరిస్థితుల్లో విడాకులు తీసుకున్నారు. హార్దిక్ ఆడంబరంగా ఉండేవాడు. స్వార్థపూరితంగా వ్యవహరించేవాడు. దీనిని నటాషా తట్టుకోలేకపోయింది. తమ మధ్య గ్యాప్ ఉన్నట్టు నటాషాకు అర్థమైంది. దీంతో కొన్ని రోజులు ఓపికతో భరించింది. చివరకు తన వల్ల కాలేక విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుందని నటాషా సన్నిహితులు తెలియజేశారు.

హార్దిక్ మారుతాడని చాలా రోజులుగా ఎంతో ఆశతో చూసిందట. తన కుమారుడి కోసం చాలా ఓపిక పట్టిందట. కానీ అతనిలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకుందట. ఎంతో బాధపడిన తర్వాత నటాషా ఈ నిర్ణయం తీసుకుందని నటాషా సన్నిహితులు తెలియజేయడం జరిగింది. ఈ విషయం తెలిసి చాలామంది నటాషాకు సపోర్ట్ గా నిలిచారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా ఇప్పుడు భారత క్రికెటర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిక్  సింగిల్ గానే ఉంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>