PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nara-chandrababu-naiduc17a7964-8853-45aa-9a30-ae5db6bf0083-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nara-chandrababu-naiduc17a7964-8853-45aa-9a30-ae5db6bf0083-415x250-IndiaHerald.jpgభారతదేశంలో హైయ్యెస్ట్ సెక్యూరిటీ పొందుతున్న అతికొద్ది మంది ముఖ్యమంత్రులలో చంద్రబాబు ఒకరు. ఏపీ సీఎం బాబుకు Z+ కేటగిరీ భద్రత లభిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం అందించే అత్యున్నత స్థాయి రక్షణ. ఈ రక్షణ వలయాన్ని దాటుకొని ఎవరూ కూడా బాబు వద్దకు రాలేరు. అలా దూరం నుంచే మాట్లాడిస్తారు కానీ, ఈ సెక్యూరిటీని దాదాపు పక్కన పెట్టేసారు అని చెప్పాలి. ఈ సెక్యూరిటీ గార్డులు ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్లు అడ్డుకోకుండా చూసుకుంటారు. మాజీ సీఎం జగన్ "పరద" సంస్కృతిని వ్యతిరేకించిన తర్వాత, బాబు ప్రజలకు వీలైనంత దగ్గరగNara Chandrababu Naidu{#}KCR;central government;Jagan;Andhra Pradesh;CM;CBN;MLA;Nijam;local languageహైయ్యెస్ట్ సెక్యూరిటీ ఉన్నా వాడుకోలేకపోతున్న చంద్రబాబు..?హైయ్యెస్ట్ సెక్యూరిటీ ఉన్నా వాడుకోలేకపోతున్న చంద్రబాబు..?Nara Chandrababu Naidu{#}KCR;central government;Jagan;Andhra Pradesh;CM;CBN;MLA;Nijam;local languageSun, 25 Aug 2024 18:23:00 GMT
భారతదేశంలో హైయ్యెస్ట్ సెక్యూరిటీ పొందుతున్న అతికొద్ది మంది ముఖ్యమంత్రులలో చంద్రబాబు ఒకరు. ఏపీ సీఎం బాబుకు Z+ కేటగిరీ భద్రత లభిస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం అందించే అత్యున్నత స్థాయి రక్షణ. ఈ రక్షణ వలయాన్ని దాటుకొని ఎవరూ కూడా బాబు వద్దకు రాలేరు. అలా దూరం నుంచే మాట్లాడిస్తారు కానీ, ఈ సెక్యూరిటీని దాదాపు పక్కన పెట్టేసారు అని చెప్పాలి. ఈ సెక్యూరిటీ గార్డులు ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్లు అడ్డుకోకుండా చూసుకుంటారు. మాజీ సీఎం జగన్ "పరద" సంస్కృతిని వ్యతిరేకించిన తర్వాత, బాబు ప్రజలకు వీలైనంత దగ్గరగా ఉంటానని హామీ ఇచ్చారు.

చంద్రబాబు నాయుడు స్వయంగా పింఛన్లు పంపిణీ చేయడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను కలుసుకునేందుకు స్థానిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఆయన ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి నుంచి వ్యక్తిగతంగా ఫిర్యాదులు, వినతులు కూడా సేకరిస్తున్నారు, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇది చాలా అరుదు. జగన్ తనని ఎమ్మెల్యేలు కూడా కలవకుండా చాలా దూరంలో ఉండిపోయారు. దాదాపు కేసీఆర్ లాగానే ఈయన కూడా అహంకారపూరితంగా నడుచుకున్నారని అంటారు దీంట్లో నిజం ఏంటో తెలియదు కానీ కేతిరెడ్డి లాంటి ఎమ్మెల్యేలు మాత్రం జగన్ తమకు అస్సలు కలవలేదని చెప్పి షాక్‌ ఇచ్చారు.

పటిష్ట భద్రత ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రజలకు దగ్గరగానే ఉంటున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తన ఎమ్మెల్యేలు, మంత్రులకు ఆయన చేసిన మొదటి సందేశం ప్రజలకు దగ్గరగా ఉండటం. వారికి ఎమ్మెల్యే మంత్రి పదవులు ఇచ్చింది ప్రజలే కాబట్టి ప్రజలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని బాబు స్పష్టం చేశారు. వారు ఎల్లప్పుడూ ప్రజలతో కనెక్ట్ అయి ఉండాలని చంద్రబాబు ఉద్ఘాటించారు. చంద్రబాబు ఇప్పుడు ఈ నిబద్ధతను రోజువారీ ఆచరణలో పెడుతున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ చేసిన అన్ని తప్పులను చంద్రబాబు చాలా నేర్చుకున్నారు వాటిని రిపీట్ కాకుండా ప్రజల్లో ఆగ్రహం కలిగించకుండా నడుచుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>