PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-mlc-ananthababu-fack-video-viral0a6c5553-526f-4798-b664-b79f4701d373-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-mlc-ananthababu-fack-video-viral0a6c5553-526f-4798-b664-b79f4701d373-415x250-IndiaHerald.jpgగత రెండు రోజులు నుంచి వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుకు సంబంధించిన ఒక వీడియో చాలా వైరల్ గా మారడమే కాకుండా వివాదాస్పదంగా కూడా మారుతున్నది. ఈ నేపథ్యంలోనే టిడిపి ఇతర పార్టీ నేతలు సైతం అనంత బాబు పైన చాలా విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఒక ట్విస్ట్ తెరమీదకి వచ్చింది. ఈ వీడియో పైన అనంత బాబు స్పందిస్తూ ఇందులో భాగంగా ఒక వీడియోతో క్లారిటీ ఇవ్వడం జరిగింది. మార్పింగ్ వీడియోతో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఫ్రెండ్స్ కుమారుడి పుట్టినరోజున వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో బర్తడే బాయ్ కి ముద్దులYCP;MLC;ANANTHABABU;FACK;VIDEO;VIRAL{#}Rampachodavaram;TDP;Telangana;CBN;Party;News;YCPవైసిపి నేత వీడియో వ్యవహారంపై బిగ్ ట్విస్ట్.. క్లారిటీ వచ్చినట్టేనా..?వైసిపి నేత వీడియో వ్యవహారంపై బిగ్ ట్విస్ట్.. క్లారిటీ వచ్చినట్టేనా..?YCP;MLC;ANANTHABABU;FACK;VIDEO;VIRAL{#}Rampachodavaram;TDP;Telangana;CBN;Party;News;YCPSun, 25 Aug 2024 18:26:00 GMTగత రెండు రోజులు నుంచి వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుకు సంబంధించిన ఒక వీడియో చాలా వైరల్ గా మారడమే కాకుండా వివాదాస్పదంగా కూడా మారుతున్నది. ఈ నేపథ్యంలోనే టిడిపి ఇతర పార్టీ నేతలు సైతం అనంత బాబు పైన చాలా విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఒక ట్విస్ట్ తెరమీదకి వచ్చింది. ఈ వీడియో పైన అనంత బాబు స్పందిస్తూ ఇందులో భాగంగా ఒక వీడియోతో క్లారిటీ ఇవ్వడం జరిగింది.


మార్పింగ్ వీడియోతో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఫ్రెండ్స్ కుమారుడి పుట్టినరోజున వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో బర్తడే బాయ్ కి ముద్దులు పెడుతున్నట్లు తెలియజేశారు. ఆ వీడియో కాల్ సైతం మార్పింగు చేసి తనని చాలామంది బ్లాక్మెయిల్ చేస్తున్నారని తెలియజేశారు అనంతబాబు. ఈ వ్యవహారం పైన ఇప్పటికే కూడా రంపచోడవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లుగా తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొంతమంది తనను భయపడించి డబ్బులు లాగాలని చూస్తున్నారంటూ తెలియజేశారు. ఆ వీడియో పూర్తిగా ఎడిట్ వీడియో అని దీనిపైన విచారణ జరపాలని కూడా పోలీసులకు తెలియజేయడం జరిగింది అనంతబాబు.


గత ఆరు నెలలుగా తెలంగాణకు చెందిన కొంతమంది తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని డబ్బులు ఇవ్వకుంటే ఇలాంటి వీడియోలు రోజుకొకటి పెడతామని భయపడిస్తున్నారట. ఈ నేపథ్యంలోని తెలంగాణ వ్యక్తుల పైన అడ్డతీగల సర్కిల్లో ఉండే ఇన్స్పెక్టర్ గత నెల ఒకటవ తారీఖున సమాచారం ఇచ్చినట్లుగా వివరించారు అనంతబాబు. ఈ సమయంలోనే అనంతబాబు ఇచ్చిన ఫిర్యాదు పైన కూడా రంపచోడవరంలో ఏఎస్పీ స్పందించడం జరిగిందట. దీనిపైన సమగ్ర విచారణ జరపాలని కూడా ఎమ్మెల్సీ అనంతబాబు కోరడం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతున్నది. మరి ఇకనైనా ఈ విషయం పైన విమర్శించిన నేతలు సైలెంట్ అవుతారో లేదో చూడాలి.
" style="height: 370px;">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>