SportsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shikhar-dhawan442d2824-f7bd-4400-8964-d419f1237e70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shikhar-dhawan442d2824-f7bd-4400-8964-d419f1237e70-415x250-IndiaHerald.jpgటీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు దేశవాలి క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్‌ ప్రకటన చేశారు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్. అలాంటి శిఖర్ ధావన్ 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీతో గొడవ పడినట్లుగా అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. మహేంద్రసింగ్ ధోని సారథ్యంలో టీమిండియా పర్యటనకు వెళ్ళింది. shikhar dhawan{#}MS Dhoni;VIRAT KOHLI;ravi shastri;Parugu;Australia;Shikhar Dhawan;Cricket;INTERNATIONAL;News;media;Indiaడ్రెస్సింగ్ రూంలో కొట్టుకున్న ధావన్, కోహ్లీ ?డ్రెస్సింగ్ రూంలో కొట్టుకున్న ధావన్, కోహ్లీ ?shikhar dhawan{#}MS Dhoni;VIRAT KOHLI;ravi shastri;Parugu;Australia;Shikhar Dhawan;Cricket;INTERNATIONAL;News;media;IndiaSun, 25 Aug 2024 14:23:00 GMTటీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు దేశవాలి క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన రిటైర్మెంట్‌ ప్రకటన చేశారు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్. అలాంటి శిఖర్ ధావన్ 2014-15 ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీతో గొడవ పడినట్లుగా అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. మహేంద్రసింగ్ ధోని సారథ్యంలో టీమిండియా పర్యటనకు వెళ్ళింది.


బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ సందర్భంగా విరాట్ కోహ్లీ, ఓపెనర్ శిఖర్ ధావన్ మధ్య గొడవ జరిగినట్లు వార్తలు వచ్చాయి. మూడో రోజు ఆటలో నాటౌట్ గా నిలిచిన శిఖర్ ధావన్ తర్వాతి రోజు ఉదయం బ్యాటింగ్ కు వెళ్లడానికి నిరాకరించాడు. ప్రాక్టీస్ లో మణికట్టుకు దెబ్బ తగిలిందని మేనేజ్మెంట్ కు చెప్పాడు. చివరి నిమిషంలో ఈ విషయాన్ని వెల్లడించడంతో హుటా హుటీనా కోహ్లీ బ్యాటింగ్ కు వెళ్లాల్సి వచ్చింది.

ముందుగా బ్యాటింగ్ కు వెళ్లేందుకు సిద్ధంగా లేనని కోహ్లీ చెప్పాడని.... కానీ తప్పని పరిస్థితుల్లో బరిలోకి దిగాడని వార్తలు వచ్చాయి. ఇక బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ కేవలం ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యారు. ఈ తరుణంలోనే డ్రెస్సింగ్ రూమ్ లోకి రాగానే శిఖర్ ధావన్ పై సీరియస్ అయ్యాడట విరాట్ కోహ్లీ. ఓపెనింగ్ సెషన్ లో బరిలోకి దిగేందుకు భయపడే ధావన్ గాయాన్ని సాకుగా చూపాడని కూడా ఆరోపణలు వచ్చాయి.


అందుకు ధావన్ బదులిస్తూ దేశం కోసం ఆడడాన్ని గర్వంగా భావిస్తానని, ఆశించిన స్థాయిలో తన ఆటతీరు లేదనుకుంటే జట్టు నుంచి తప్పుకోవడానికి కూడా వెనకాడబోనని కోహ్లీకి స్పష్టం చేశాడట ధావన్. అంతేగానీ లేనిపోని గాయాలను ఉన్నట్టుగా చెప్పనని అన్నాడట. ఈ వివాదం చోటు చేసుకున్న సమయంలో అక్కడే ఉన్న టీమ్ ఇండియా డైరెక్టర్ రవిశాస్త్రి జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దడానికి, కోహ్లీని మందలించినట్లు వార్తలు వచ్చాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>