DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/n-convention5b46a264-0865-48b4-b435-94f5fce2a0cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/n-convention5b46a264-0865-48b4-b435-94f5fce2a0cf-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారున్న ప్రతి చోట ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ప్రాపర్టీని మెరుపు వేగంతో కూల్చేయడం.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా మెరుపు వేగంతో హైడ్రా అధికారులు దీనిని నేలమట్టం చేశారంటూ నాగార్జున ఆరోపించడం.. వంటి వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. ఈ కూల్చివేతను పక్కన పెడితే.. ఈ ఎన్ కన్వెన్షన్ ఎందుకంత స్పెషల్ అన్నదే ఆసక్తికరంగా మారింది. దీని గురించి నెటిజన్లు గూగుల్ లో తెగn convention{#}Google;Prasthanam;Hyderabad;Event;Akkineni Nagarjuna;Fashion;Telugu;Cinemaఒర్నీ.. ఎన్ కన్వెన్షన్ ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవుతారుఒర్నీ.. ఎన్ కన్వెన్షన్ ప్రత్యేకతలు తెలిస్తే షాక్ అవుతారుn convention{#}Google;Prasthanam;Hyderabad;Event;Akkineni Nagarjuna;Fashion;Telugu;CinemaSun, 25 Aug 2024 15:00:00 GMTరెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారున్న ప్రతి చోట ఎన్ కన్వెన్షన్ కూల్చివేత గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ప్రాపర్టీని మెరుపు వేగంతో కూల్చేయడం.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా  మెరుపు వేగంతో హైడ్రా అధికారులు దీనిని నేలమట్టం చేశారంటూ నాగార్జున ఆరోపించడం.. వంటి వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.


ఈ కూల్చివేతను పక్కన పెడితే.. ఈ ఎన్ కన్వెన్షన్ ఎందుకంత స్పెషల్ అన్నదే ఆసక్తికరంగా మారింది. దీని గురించి నెటిజన్లు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు అంట. అసలు ఇక్కడ ఫంక్షన్ చేసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తారు. తాము జరుపుకొనే వేడుకలకు వీలుగా ఈ కన్వెన్షన్ సెంటర్ ఖాళీగా లేకుంటే.. తమ ఈవెంట్ ను వాయిదా వేసుకున్నసందర్భాలు లేకపోలేదు అని పలువురు పేర్కొంటున్నారు. కాంక్రీట్ జంగిల్ మాదిరి ఉండే హైదరాబాద్ మహా నగరంలో ఒక లేక్.. దాని పక్కనే ఉండే ఎన్ కన్వెన్షన్ మిగిలిన వాటికి కాస్తంత భిన్నంగానే కాదు..



ఇక్కడ సమ్ థింగ్ స్పెషల్ గా కూడా ఉంటుందంట. దీనికి తోడు హైటెక్ సిటీకి అత్యంత సమీపంలో మరింత క్లియర్ గా చెప్పాలంటే శిల్పారామం ఎదురుగా కాస్తంతా లోపలకి ఉంటుంది. అందరికీ అనువుగా ఉండే ప్లేస్ కు తమ్మడికుంట చెరువును ఆనుకొని ఉండటం మరో ప్రత్యేకతగా చెబుతారు.


ఇక్కడ మొత్తం నాలుగు వేదికలు ఉన్నాయి. ఒక దాంట్లో మూడు వేల మంది కూర్చునే పెద్ద హాల్ ఉంటుంది. ఖరీదైన వివాహాలు, రిసెప్షన్లు, భారీ ఫ్యాషన్ షోలు, సినిమా వేడుకలు మాత్రమే ఇందులో నిర్వహిస్తుంటారు. ఐటీ కంపెనీల ప్రత్యేక వేడుకలు సైతం చేస్తుంటారు. మిగతా మూడు కూడా ఈ స్థాయిలోనో హంగూ ఆర్భాటాలతో ఉంటాయి. భారీ ఎత్తున పార్కింగ్ ఉండటం సానుకూలాంశం. దీని అద్దె రూ.50లక్షల వరకు ఉంటుందనే టాక్ వినిపిస్తుంది. వివాదాలతో మొదలైన ప్రస్థానం అదే వివాదంతో పద్నాలుగేళ్లకు ముగియడం కొసమెరుపు.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>