MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-3385a06c-74bf-48a8-9404-6db86c41fb17-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-3385a06c-74bf-48a8-9404-6db86c41fb17-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సినీ నటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ను శనివారం రోజున కూల్చివేశారు. ఈ కూల్చివేతలపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. తుమ్మిడికుంట చెరువు ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్లలోని ఆక్రమణలను సిబ్బంది కూల్చివేశారన్నారు. హైడ్రా, జిహెచ్ఎంసి, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కూల్చి వేశారని తెలియజేశారు. tollywood {#}Pond;Madhapur;ranganath;Government;Saturday;Akkineni Nagarjuna;News;Hero;Tollywood;Telugu;Industry;Cinemaరేవంత్‌ రెడ్డికి షాక్‌..రహస్యంగా టాలీవుడ్‌ పెద్దల మీటింగ్‌?రేవంత్‌ రెడ్డికి షాక్‌..రహస్యంగా టాలీవుడ్‌ పెద్దల మీటింగ్‌?tollywood {#}Pond;Madhapur;ranganath;Government;Saturday;Akkineni Nagarjuna;News;Hero;Tollywood;Telugu;Industry;CinemaSun, 25 Aug 2024 12:18:17 GMTటాలీవుడ్‌ ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సినీ నటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ను శనివారం రోజున కూల్చివేశారు. ఈ కూల్చివేతలపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. తుమ్మిడికుంట చెరువు ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్లలోని ఆక్రమణలను సిబ్బంది కూల్చివేశారన్నారు. హైడ్రా, జిహెచ్ఎంసి, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కూల్చి వేశారని తెలియజేశారు.


తుమ్మిడికుంట చెరువులోని అనధికారిక నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ సైతం ఒకటని... చెరువులోని ఎల్ టి ఎఫ్ లో ఎకరా 12 గుంటల్లో ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారన్నారు. బఫర్ జోన్ లోని రెండు ఎకరాల 18 గుంటల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని....ఎన్ కన్వెన్షన్ జీహెచ్ఎంసి నుంచి నిర్మాణ అనుమతులు లేవని తెలియజేశారు.  కేసీఆర్‌ పాలనలో అనుమతుల కోసం ఎన్ కన్వెన్షన్ ప్రయత్నించిందని సమాచారం. కానీ అప్పటి అధికారులు ఎన్ కన్వెన్షన్ కు పూర్తి స్థాయిలో అనుమతలు ఇవ్వలేదట.


ఇదిలా ఉండగా.... ఎన్ కన్వెన్షన్ శనివారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేయగా దీనిపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో టాలీవుడ్ పరిశ్రమ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం అందుతోంది. నాగార్జున బిజినెస్ ప్రాపర్టీని ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసిన ప్రభుత్వం వైఖరిపై తెలుగు సినీ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయట. ఒక బడా హీరో ఇంట్లో ఇండస్ట్రీ పెద్దలు, హీరోలు, నిర్మాతలు కలుసుకున్నారట.


ఇలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు సరైనవి కావంటూ అభిప్రాయం వ్యక్తం చేశారట. సినిమా రంగానికి సంబంధం లేని గద్దర్ పేరుతో సినీ అవార్డ్స్ విషయంపై కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారట ప్రముఖ సినీ నటీ నటులు. అయితే.. టాలీవుడ్‌ ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ను కూల్చి వేస్తే.. మెగాస్టార్‌ చిరంజీవి, ఎన్టీఆర్‌  కుటుంబాలు ఎందుకు మాట్లాడటం లేదని ఫైర్‌ అవుతున్నారు కొంత మంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>