PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nadendlamanohare0140b34-93f0-4b12-a6fb-cbb09d52e828-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/nadendlamanohare0140b34-93f0-4b12-a6fb-cbb09d52e828-415x250-IndiaHerald.jpg* కాంగ్రెస్ నుండి రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నిక.! * ఉమ్మడి ఏపీలో శాసనసభకు స్పీకర్ చేసిన అనుభవం.! * 2018లో కాంగ్రెస్ టూ జనసేనలోకి ఎంట్రీ.? * 2024లో జనసేన తరపున మంత్రి.! (ఏపీ-ఇండియాహెరాల్డ్): నాదెండ్ల మనోహర్...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఈ పేరు కొత్తేమీ కాదు.ఉమ్మడి ఏపీలో కొంతకాలం సీఎంగా చేసిన నాదెండ్ల భాస్కరరావు కుమారుడుగా అలాగే ఏపీ శాసనసభ స్పీకర్గా సుపరిచితుడే.ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి వివిధ హోదాల్లో పార్టీకి పనిచేశాడు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెకnadendlamanohar{#}Bharatiya Janata Party;Nadendla Manohar;Janasena;Tenali;Nadendla Bhaskara Rao;Andhra Pradesh;tuesday;Kiran Kumar;Hanu Raghavapudi;Party;Arrest;Congress;Minister;Newsకాంగ్రెస్ లో సైలెంట్ గా ఉండి .. జనసేనలో తన మార్క్ చూపిస్తున్న 'నాదెండ్ల'...!కాంగ్రెస్ లో సైలెంట్ గా ఉండి .. జనసేనలో తన మార్క్ చూపిస్తున్న 'నాదెండ్ల'...!nadendlamanohar{#}Bharatiya Janata Party;Nadendla Manohar;Janasena;Tenali;Nadendla Bhaskara Rao;Andhra Pradesh;tuesday;Kiran Kumar;Hanu Raghavapudi;Party;Arrest;Congress;Minister;NewsSat, 24 Aug 2024 09:36:00 GMT* కాంగ్రెస్ నుండి రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నిక.!
* ఉమ్మడి ఏపీలో శాసనసభకు స్పీకర్ చేసిన అనుభవం.!
* 2018లో కాంగ్రెస్ టూ జనసేనలోకి ఎంట్రీ.?
* 2024లో జనసేన తరపున మంత్రి.!

(ఏపీ-ఇండియాహెరాల్డ్):  నాదెండ్ల మనోహర్...ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఈ పేరు కొత్తేమీ కాదు.ఉమ్మడి ఏపీలో కొంతకాలం సీఎంగా చేసిన నాదెండ్ల భాస్కరరావు కుమారుడుగా అలాగే ఏపీ శాసనసభ స్పీకర్గా సుపరిచితుడే.ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి వివిధ హోదాల్లో పార్టీకి పనిచేశాడు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్యస్యుఐ యూత్ కాంగ్రెస్ అభివృద్ధిపై దృష్టిసారించాడు.మనోహర్ 2004, 2009 సార్వత్రిక ఎన్నికలలో తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2009లో ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2011 జూన్‌లో శాసనసభ స్పీకర్‌గా నియమితుడై 2011 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి స్పీకర్‌గా పని చేశారు. నాదెండ్ల మనోహర్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వి‌భజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు.ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదని గ్రహించిన దాంట్లో మనోహర్ 2018 అక్టోబర్‌లో జనసేన పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.ఆ తర్వాత 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడిన కారణంగా తెనాలి నుండి టికెట్ వస్తుందో రాదో అని టెన్షన్ పడ్డ నాదెండ్లకు జనసేన అధినేత పట్టుపట్టడంతో తెనాలి అసెంబ్లీ టికెట్ నాదెండ్లకు వరించింది.అయితే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున బరిలో దిగిన నాదెండ్ల భారీగా విజయం సాధించి ప్రస్తుతం కూటమిలో భాగంగా జనసేన నుండి పౌరసరఫరాల శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోసపూరిత రేషన్ డీలర్లపై ఉక్కుపాదం మోపారు.రోజుకో ప్రాంతంలో ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పర్యటిస్తున్న ఆయన గత ప్రభుత్వ నాయకులు, అధికారులు చేసిన అక్రమాలను వెలికి తీస్తూ.. చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గత ఐదేండ్లలో లక్షల టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణాకు గురైందని నిర్ధారించిన మంత్రి వారిపై కేసులు పెట్టేందుకు సిద్ధం అయ్యారు. ఇదే విషయంపై మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇకపై ఎవరైన అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తే అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అలాగే గతంలో రేషన్ బియ్యం తరలించిన వారికి త్వరలో 41ఏ నోటీసులు ఇస్తామని.. ఇప్పటికే 6ఏ కింద నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేశామని గుర్తు చేశారు. దీంతో పాటుగా అక్రమంగా రేషన్ బియ్యం తరలింపును అరికట్టేందుకు చెకోపోస్ట్ దగ్గర అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తామని.. అవసరమైతే కీలక ప్రాంతాల్లో మరిన్ని చెకోపోస్టులు ఏర్పాటు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు.అయితే మంత్రిగా తనకు ఇచ్చిన శాఖా పరంగా ఇకపై తప్పులు చేస్తే సహించనని చట్ట ప్రకారంగా శిక్షలు ఉంటాయని రేషన్ మాఫియా చేస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చారు.నాదెండ్ల మనోహర్ పరంగా ఆయన విమర్శలకు దూరంగా ఉండే నేత ఆయన కాంగ్రెస్ లో ఉన్న ఏనాడూ కూడా ఎవరిని విమర్శించే విధంగా ఎప్పుడు మాట్లాడలేదు.ఉమ్మడి ఏపీ విభజన కారణంగా రాష్ట్రాంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయిందని కాంగ్రెస్ కు రాజకీయా భవిష్యత్తు ఉండదని ముందే గ్రహించి అందుకే కాంగ్రెస్ నుండి జనసేన లోకి మారినట్లు తెలుస్తుంది.ఆయన జనసేనలోకి వచ్చిన తర్వాత కూడా ఎవరిని కించపరిచేలా వ్యాఖ్యనించలేదు.ప్రస్తుతం తనశాఖలో గతంలో జరిగిన తప్పులు సరిదిద్దుతూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు సైలెంట్ గా ఉన్న నాదెండ్ల మనోహర్ జనసేనలోకి చేరిన తరువాత పార్టీ అధినేత అడుగుజాడల్లో నడుస్తూ ఆకస్మిక తనిఖీలు చేస్తూప్రత్యర్థుల గుండెల్లో భయాన్ని కలిగిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>