MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood683f08ee-d48d-4bcc-a843-214f9c657786-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood683f08ee-d48d-4bcc-a843-214f9c657786-415x250-IndiaHerald.jpgగ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్, ‘జరగండి జరగండి..’ సాంగ్‌ మినహా సరైన అప్డేట్ మాత్రం ఇప్పటి వరకు మేకర్స్ నుంచి రాలేదనే చెప్పుకోవాలి. ఈ విషయంలో నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు ఎగిరి గంతేసే విషయం tollywood{#}Kiara Advani;dil raju;shankar;Christmas;Dil;Darsakudu;Ram Charan Teja;ram pothineni;Chitram;bollywood;Director;Cinemaగేమ్ చేంజర్: దిల్ రాజుకి తలనొప్పిగా మారిన శంకర్ ట్విస్ట్..!?గేమ్ చేంజర్: దిల్ రాజుకి తలనొప్పిగా మారిన శంకర్ ట్విస్ట్..!?tollywood{#}Kiara Advani;dil raju;shankar;Christmas;Dil;Darsakudu;Ram Charan Teja;ram pothineni;Chitram;bollywood;Director;CinemaSat, 24 Aug 2024 12:20:00 GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్స్, ‘జరగండి జరగండి..’ సాంగ్‌ మినహా సరైన అప్డేట్ మాత్రం ఇప్పటి వరకు మేకర్స్ నుంచి రాలేదనే చెప్పుకోవాలి. ఈ విషయంలో నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు ఎగిరి గంతేసే విషయం బయటకు వచ్చింది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా భారీ బడ్జెట్ తో ఈ

 సినిమా తెరకెక్కుతోంది. దాదాపు షూటింగ్ మెుత్తం పూర్తి కావొచ్చింది. ఇక ఈ సినిమాకు డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని దిల్ రాజు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు.  రామ్ చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దర్శకుడు శంకర్ తో భారీ సినిమా తీయాలనేది దిల్ రాజు డ్రీమ్. అందుకే, ఆయన ఈ భారీ సినిమాని మొదలుపెట్టి ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా పంటి బిగువున ముందుకు వెళ్తున్నారు.  అయితే ఇటీవల రఫ్ కట్ చూసిన తర్వాత దర్శకుడు శంకర్..కొన్ని పోర్షన్స్ రీషూట్ చేయాలని దిల్ రాజుకు చెప్పారట. ఆ రీషూట్ కోసం రామ్ చరణ్ వి నాలుగు నుంచి ఐదు

 రోజులు డేట్స్ కావాలి. రామ్ చరణ్ ని ఎలాగోలా ఒప్పించి తీసుకువద్దామన్నా శంకర్ సినిమా అంటే భారీ గా ఉంటాయి అన్నీ,వందల్లో క్రూ మెంబర్స్, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ లు కావాలి. వీళ్లందరి డేట్స్ పట్టుకోవటం, మళ్లీ ఖర్చు పెట్టడం నిర్మాతగా దిల్ రాజుకు పెద్ద ఛాలెంజ్. అలాగే ఎగస్ట్రా ఫైనాన్సియల్ బర్డెన్. ఇప్పుడు దిల్ రాజు ...రామ్ చరణ్ ని కలిసి ఒప్పించి డేట్స్ తీసుకోవాలి. ఇలా దిల్ రాజుకు ఈ లాస్ట్ మినిట్ ట్విస్ట్ లాంటిది ఊహించనది అయ్యిందంటున్నారు. అయితే ఇలాంటి భారీ సినిమాలకు రీషూట్ లు తప్పనిసరి అనేది నిజం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>