PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/congress-prabhuthvam-pai-nagarjuna-fire-pakka-adaralu-unnayantu-d4d54729-d09b-4438-9314-b3b20fc8ae34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/congress-prabhuthvam-pai-nagarjuna-fire-pakka-adaralu-unnayantu-d4d54729-d09b-4438-9314-b3b20fc8ae34-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మాదాపూర్ లోని సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చి వేసిన సంగతి మనకు తెలిసిందే. హైడ్రా పేరుతో చెరువులు,నాళాలను ఆక్రమించుకొని కట్టిన అక్రమ కట్టడాలను కూల్చి వేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ గా హైడ్రా అనే పేరుతో అక్రమ కట్టడాలను కూల్చివేయడమే పనిగా పెట్టుకుంది. రీసెంట్ గా గండిపేట లోని అక్రమ కట్టడాలని కూల్చివేసింది. ఇక తాజాగా ఈరోజు ఉదయాన్నే సినీ నటుడు అక్కినేని నాగార్జున కి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చడంతో ఒక్కసారిగా ఈ వార్త మీడCONGRESS; NAGARJUNA; N CONVENTION CENTER; TELANGANA{#}Madhapur;Akkineni Nagarjuna;Pond;court;Government;Congressకాంగ్రెస్ ప్రభుత్వం పై నాగార్జున ఫైర్.. పక్కా ఆధారాలు ఉన్నాయంటూ.?కాంగ్రెస్ ప్రభుత్వం పై నాగార్జున ఫైర్.. పక్కా ఆధారాలు ఉన్నాయంటూ.?CONGRESS; NAGARJUNA; N CONVENTION CENTER; TELANGANA{#}Madhapur;Akkineni Nagarjuna;Pond;court;Government;CongressSat, 24 Aug 2024 13:02:00 GMTకాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మాదాపూర్ లోని సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చి వేసిన సంగతి మనకు తెలిసిందే. హైడ్రా పేరుతో చెరువులు,నాళాలను ఆక్రమించుకొని కట్టిన అక్రమ కట్టడాలను కూల్చి వేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ గా హైడ్రా అనే పేరుతో అక్రమ కట్టడాలను కూల్చివేయడమే పనిగా పెట్టుకుంది. రీసెంట్ గా గండిపేట లోని అక్రమ కట్టడాలని కూల్చివేసింది. ఇక తాజాగా ఈరోజు ఉదయాన్నే సినీ నటుడు అక్కినేని నాగార్జున కి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చడంతో ఒక్కసారిగా ఈ వార్త మీడియాలో వైరల్ గా మారింది. అయితే తుమ్మిడి కుంట చెరువులో దాదాపు మూడు ఎకరాల 30 గుంటల భూమిని కబ్జా చేసి నాగార్జున చెరువులో అడ్డంగా గోడ కట్టి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. 

దీంతో వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని లోని మూడు ఎకరాల 30 గుంటల వరకు ఉన్న నిర్మాణం మొత్తాన్ని కూల్చివేసింది. అయితే ఈ విషయంపై తాజాగా నాగార్జున స్పందించారు.. నేను ఈ విషయంపై కోర్టులో స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ చట్టానికి విరుద్ధంగా పని చేశారు..ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ కట్టడం కాదు. నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే దీన్ని ఎలా కూల్చివేస్తారు.. కేసు కోర్టులో ఉండగానే ఇలా చేయడం చట్టానికి విరుద్ధం.. ఒకవేళ కోర్టు గనుక కూల్చివేయమని ఆర్డర్ ఇస్తే మీ కంటే ముందు నేనే కూల్చివేసే వాడిని.అలాగే నేను ఎలాంటి చట్టాన్ని ఉల్లంఘించలేదు.

ఏ చెరువులో నేను భూమిని కబ్జా చేయలేదు.. నేను కట్టిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పూర్తిగా పట్టా ఉంది. చెరువు నుండి నేను ఒక్క అంగుళం భూమిని కూడా కబ్జా చేయలేదు. నేను కొనుక్కున్న నా భూమిలోనే ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపట్టాను. అది పూర్తిగా ప్రైవేట్ ల్యాండ్. ప్రభుత్వ భూమి కానే కాదు.. ఈ విషయంపై నేను కోర్టును ఆశ్రయిస్తాను అంటూ నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత పై తాజాగా రియాక్ట్ అయ్యారు.. మరి నాగార్జున ట్వీట్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>