PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ministeref638dc4-1a6c-4107-8dbd-3c5133fc9b29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ministeref638dc4-1a6c-4107-8dbd-3c5133fc9b29-415x250-IndiaHerald.jpg. ఒకటి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ శాఖ సహాయ మంత్రి, రెండోది టూరిజం మంత్రి. రెండు ముఖ్యమైన పదవులు కేంద్ర మంత్రి పదవి వస్తే ఎవరైనా సంతోషిస్తారు.. ఎగిరి గంతేస్తారు. కానీ.. ఆయన మాత్రం తనకు ఎందుకు వచ్చిన ఈ మంత్రి పదవులు.. తనను ఈ మంత్రి పదవిలో నుంచి తీసేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. అదేంటి మంత్రి పదవి వస్తే వద్దు అనుకుంటున్న ఆ నేత ఎవరు..? అనుకుంటున్నారా.. ఆయన ఎవరో? కాదు మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి. minister{#}MP;Ministerమంత్రి ప‌ద‌వి తీసేస్తే ఫుల్ హ్యాపీ అంటోన్న మంత్రి గారు.. ఇదేంట్రా బాబు..?మంత్రి ప‌ద‌వి తీసేస్తే ఫుల్ హ్యాపీ అంటోన్న మంత్రి గారు.. ఇదేంట్రా బాబు..?minister{#}MP;MinisterSat, 24 Aug 2024 12:40:38 GMTఆయన కేంద్ర మంత్రిగా ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. పైగా మోడీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. రెండు కీలకమైన శాఖలకు ఆయన మంత్రి. ఒకటి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ శాఖ సహాయ మంత్రి, రెండోది టూరిజం మంత్రి. రెండు ముఖ్యమైన పదవులు కేంద్ర మంత్రి పదవి వస్తే ఎవరైనా సంతోషిస్తారు.. ఎగిరి గంతేస్తారు. కానీ.. ఆయన మాత్రం తనకు ఎందుకు వచ్చిన ఈ మంత్రి పదవులు.. తనను ఈ మంత్రి పదవిలో నుంచి తీసేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. అదేంటి మంత్రి పదవి వస్తే వద్దు అనుకుంటున్న ఆ నేత ఎవరు..? అనుకుంటున్నారా.. ఆయన ఎవరో? కాదు మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి.


సురేష్ గోపి 1965 నుంచి సినిమాలలో నటిస్తున్నారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు తెలుగులోకి డ‌బ్‌ అయ్యాయి. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా అందుకున్నారు. ఆయన నటుడు మాత్రమే కాదు.. గాయకుడు కూడా. సినిమాల్లో సోలోగా పాటలు కూడా పాడుతూ ఉంటారు. అలాగే రెండు తెలుగు సినిమాలలోను ఆయన డైరెక్ట్‌ గా న‌టించారు. ఈ యేడాది ఆయన త్రిసూర్ నుంచి లోక్ సభకు ఎంపీగా గెలిచారు. బిజెపి తరఫున కేరళలో గెలిచిన ఏకైక ఎంపీ కావడంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. మోడీ అయితే తనకు మంత్రి పదవి ఇచ్చిన.. చిన్నప్పటి నుంచి తనకు ఎంతో ఇష్టమైన సినిమాలలో తాను నటించలేకపోతున్నాను అన్న బెంగ సురేష్ గోపికి పట్టుకుందట. ఇప్పటికే అయ‌న అన్నీ కలిపి 20 నుంచి 22 సినిమాలు వరకు కమిట్ అయ్యారు. తాను నటించాల్సిన సినిమాల జాబితా తీసుకువెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్షాని కలిసి.. తాను సినిమాల్లో నటిస్తాను పర్మిషన్ ఇవ్వాలని వేడుకున్నారట.


అయితే అమిత్షా ఆ లిస్టు పక్కన పడేసి నాయకత్వానికి విధేయుడుగా ఉండాలి.. మంత్రివి కాబట్టి హుందాగా ఉండాలని చెప్పారట. ఏది ఏమైనా సురేష్ గోపికి మంత్రి పదవి వచ్చిన ఏమాత్రం సంతోషంగా లేరట. ఆయన ఇప్పుడు మంత్రి పదవి వదులుకొని సినిమాల్లో నటించాలని ఎంతో ఉత్సాహ పడుతున్నారు. కానీ.. కేంద్ర అధినాయకత్వం అందుకు ఒప్పుకోవటం లేదు. ఆ మాటకు వస్తే గతంలో ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రిగా ఉంటూ సొంత సినిమాల్లో నటించి విమర్శలు ఎదుర్కొన్నారు. చిరంజీవి మాత్రం రాజకీయాల్లో ఉన్నంతకాలం సినిమాల జోలికి పోలేదు. రాజకీయాలు విరమించుకున్న తర్వాత తిరిగి సినిమాలలోకి వచ్చారు. ఇక ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు కూడా మూడు నాలుగు ఉన్నాయి. మరి పవన్ ఏం చేస్తారో..? కూడా చూడాల్సి ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>