PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-peddireddy-ramachandra-reddy-chittoor3df9d163-5eca-4495-8826-91d974fa80eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-peddireddy-ramachandra-reddy-chittoor3df9d163-5eca-4495-8826-91d974fa80eb-415x250-IndiaHerald.jpg•తండ్రి హయాంలోనే కాదు కొడుకు హయాంలో కూడా మంత్రిగా •పార్టీ మారిన హోదా తగ్గలేదు •గొప్ప నేతగా నిరూపించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ ) సాధారణంగా రాజకీయ నాయకులు ఒక పార్టీలో కొనసాగుతున్న సమయంలో ఆ పార్టీలో విభేదాలు వచ్చినా లేదా ఆ పార్టీ ఓడిపోయినా సరే ఇంకొక పార్టీకి మకాం మారుస్తూ ఉంటారు. అయితే పార్టీ మారిన తర్వాత కొంతమంది పదవుల కోసం వెతుకులాడితే, మరికొంతమంది ముందు ఏ పార్టీలో అయితే ఉన్నారో ఏ పదవినైతే పొందారో పార్టీ మారిన తర్వాత కూడా అంతే హోదా అనుభవించిన రాజకYSRCP;PEDDIREDDY RAMACHANDRA REDDY;CHITTOOR{#}sree;2020;Pileru;Punganur;Y. S. Rajasekhara Reddy;dr rajasekhar;Hanu Raghavapudi;Reddy;రాజీనామా;YCP;Jagan;Party;Congress;Government;Indiaపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పార్టీలు మారిన స్టార్డం తగ్గలేదు..!పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పార్టీలు మారిన స్టార్డం తగ్గలేదు..!YSRCP;PEDDIREDDY RAMACHANDRA REDDY;CHITTOOR{#}sree;2020;Pileru;Punganur;Y. S. Rajasekhara Reddy;dr rajasekhar;Hanu Raghavapudi;Reddy;రాజీనామా;YCP;Jagan;Party;Congress;Government;IndiaSat, 24 Aug 2024 11:20:00 GMT•తండ్రి హయాంలోనే కాదు కొడుకు హయాంలో కూడా మంత్రిగా


•పార్టీ మారిన హోదా తగ్గలేదు

•గొప్ప నేతగా నిరూపించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..



ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ )

సాధారణంగా రాజకీయ నాయకులు ఒక పార్టీలో కొనసాగుతున్న సమయంలో ఆ పార్టీలో విభేదాలు వచ్చినా లేదా ఆ పార్టీ ఓడిపోయినా సరే ఇంకొక పార్టీకి మకాం మారుస్తూ ఉంటారు. అయితే పార్టీ మారిన తర్వాత కొంతమంది పదవుల కోసం వెతుకులాడితే,  మరికొంతమంది ముందు ఏ పార్టీలో అయితే ఉన్నారో ఏ పదవినైతే పొందారో పార్టీ మారిన తర్వాత కూడా అంతే హోదా అనుభవించిన రాజకీయ నాయకులు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఒకరు.

1974 శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడే విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన ఈయన,  1978లో జనతా పార్టీ అభ్యర్థిగా 1985, 94లో కాంగ్రెస్ అభ్యర్థిగా పీలేరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్లో కొనసాగుతూ 1989, 1999, 2004 సంవత్సరాల కాలంలో పీలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది హ్యాట్రిక్ అందుకున్నాడు.  2008లో పిసిసి ఉపాధ్యక్షుడిగా నియమితులైన  ఈయన 2009లో పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాదు అదే సంవత్సరంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి , కొనిజేటి రోశయ్య మంత్రివర్గంలో అడవులు ,పర్యావరణ శాఖ,  సాంకేతిక శాఖ మంత్రిగా కూడా పనిచేసి తనను తాను నిరూపించుకున్నారు.

ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీలో చేరి 2014, 2019 ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు .2019లో వైయస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి , గనులు , భూగర్భ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు.. ఇక ఆ తర్వాత గ్రామ సచివాలయం,  వాలంటీర్ల శాఖ బాధ్యతలను 2020 సెప్టెంబర్ 21న అప్పటి ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. మొత్తానికి అయితే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసిన ఈయన,  ఆ తర్వాత వైసిపి పార్టీలోకి చేరి రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా మంత్రిగా పనిచేసి రికార్డు సృష్టించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>