Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janbi8e7076f5-2419-4767-b6c4-a3171117e2ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janbi8e7076f5-2419-4767-b6c4-a3171117e2ca-415x250-IndiaHerald.jpg బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సినిమాతో తెలుగు పేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. ఈ ముద్దుగుమ్మ చాలా నాజూగ్గా తయారయ్యింది. చాలా అందంగా కూడా కనిపిస్తోంది. అందుకే తెలుగు సినిమా హీరోలకు తమ నెక్స్ట్ సినిమాల్లో ఆమె ఫస్ట్ ఆప్షన్ అవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు తమ సినిమాల్లో ఆమెను తీసుకున్నారు. ఇటీవల విడుదలైన 'చుట్టమల్లె' పాట చూస్తే, ఆమె అందం కేక పుట్టించింది దీన్ని బట్టి స్టార్ హీరోలకు తగ్గట్టుగా కమరJanbi{#}Janhvi Kapoor;jahnavi;sukumar;contract;Ram Charan Teja;Allu Arjun;December;Heroine;Telugu;Cinemaజాన్వీ కపూర్‌తో దేవర మూవీ టీమ్ షాకింగ్ ఒప్పందం.. ఇది అన్యాయం..?జాన్వీ కపూర్‌తో దేవర మూవీ టీమ్ షాకింగ్ ఒప్పందం.. ఇది అన్యాయం..?Janbi{#}Janhvi Kapoor;jahnavi;sukumar;contract;Ram Charan Teja;Allu Arjun;December;Heroine;Telugu;CinemaSat, 24 Aug 2024 15:30:00 GMT

బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సినిమాతో తెలుగు పేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. ఈ ముద్దుగుమ్మ చాలా నాజూగ్గా తయారయ్యింది. చాలా అందంగా కూడా కనిపిస్తోంది. అందుకే తెలుగు సినిమా హీరోలకు తమ నెక్స్ట్ సినిమాల్లో ఆమె ఫస్ట్ ఆప్షన్ అవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు తమ సినిమాల్లో ఆమెను తీసుకున్నారు. ఇటీవల విడుదలైన 'చుట్టమల్లె' పాట చూస్తే, ఆమె అందం కేక పుట్టించింది  దీన్ని బట్టి  స్టార్ హీరోలకు తగ్గట్టుగా కమర్షియల్ విలువను కూడా తీసుకురాగలదు అని తెలుస్తోంది.

ఇప్పుడు పుష్ప 2 సినిమాలో జాన్వి కపూర్ ఒక పాట చేయాలని సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరూ చాలా రోజులుగా కోరుకుంటున్నారు. కానీ, ఆమె మరో సినిమా 'దేవర'లో నటిస్తోంది. ఆ సినిమా నిర్మాతలు ఆమె 'దేవర' సినిమా రిలీజ్ అయ్యే వరకు మరే తెలుగు సినిమాలోనూ నటించకూడదని ఒప్పందం చేసుకున్నారు. దీనివల్ల ఆమె కొద్దిగా ఖాళీగా ఉన్నా సరే ఏ సినిమాలోను నటించే అవకాశం ఉండదు. పుష్ప 2 సినిమాను మొదట ఆగస్టు 15న రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఆలోగా జాన్వీ ఆ పాట చేయలేకపోయింది. కానీ ఇప్పుడు పుష్ప 2 సినిమా రిలీజ్ డిసెంబర్‌కు వాయిదా పడింది. 'దేవర' సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ అవుతుంది. అంటే జాన్వి ఇప్పుడు పుష్ప 2 సినిమాలో ఆ పాట చేయవచ్చు అన్నమాట. దేవర మూవీ ఒప్పంద లేకపోతే ఆమె ఇప్పటికే ఈ షూటింగ్ పూర్తి చేసి మరొక ప్రాజెక్టు కూడా చేసి ఉండేది.

దేవర సినిమా టీం ఎందుకు ఇలాంటి కాంట్రాక్టు కుదుర్చుకుందో తెలియ రాలేదు. పుష్ప 2 సినిమాలో ఒక పాట చేయడానికి సుకుమార్, అల్లు అర్జున్ ముందు 'అనిమల్' సినిమాలో నటించిన త్రిప్తి డిమ్రిని ఆలోచించారు. కానీ, 'ఊ అంటావా ఊ ఊ అంటావా' అనే పాట పుష్ప ఫస్ట్ పార్ట్ లో ఎంత హిట్ అయిందో అంతలా చేయగల నర్తకి ఆమె కాదని అనుకున్నారు.

అందుకే అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరూ చాలా అందంగా ఉంటూనే చక్కగా నర్తించగల నటి కోసం వెతుకుతున్నారు. వారి అభిప్రాయం ప్రకారం, జాన్వీ కపూర్ అలాంటి నటి. అందుకే పుష్ప 2 సినిమాలో ఆమె ఒక పాట చేయబోతుంది. డిసెంబర్ 6న పుష్ప 2 సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ చేసే పాట కూడా 'ఊ అంటావా ఊ ఊ అంటావా' లాగానే హిట్ అయితే, తెలుగు సినిమాల్లో అందరి హీరోల సినిమాల్లో నటించే అవకాశం ఆమెకు వస్తుంది..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>