MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ramce2027da-b365-4ec6-a178-ba6486532451-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ramce2027da-b365-4ec6-a178-ba6486532451-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి లవర్ బాయ్ ఈమేజ్ ను సంపాదించుకున్న యువ హీరోలలో రామ్ పోతినేని ఒకరు. ఈయన వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాస్ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఉన్నా ఇది లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రామ్ విజయాలు అందుకున్న చాలా సినిమాలు కూడా కమర్షియల్ సినిమాలు కాకుండా లవ్ , రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లు గాRam{#}y v s choudary;Goa;Silver;Devadas;Ileana D'Cruz;Lover;Yuva;Romantic;ram pothineni;puri jagannadh;Comedy;Audience;Love;Variar;ismart shankar;Mass;Hero;Box office;Cinemaరామ్ కి వరసగా ఫ్లాప్ లు వచ్చేది అందుకే.. అలా చేస్తే మళ్లీ బ్లాక్ బాస్టర్స్ గ్యారెంటీ..?రామ్ కి వరసగా ఫ్లాప్ లు వచ్చేది అందుకే.. అలా చేస్తే మళ్లీ బ్లాక్ బాస్టర్స్ గ్యారెంటీ..?Ram{#}y v s choudary;Goa;Silver;Devadas;Ileana D'Cruz;Lover;Yuva;Romantic;ram pothineni;puri jagannadh;Comedy;Audience;Love;Variar;ismart shankar;Mass;Hero;Box office;CinemaSat, 24 Aug 2024 14:45:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి లవర్ బాయ్ ఈమేజ్ ను సంపాదించుకున్న యువ హీరోలలో రామ్ పోతినేని ఒకరు. ఈయన వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన దేవదాస్ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఉన్నా ఇది లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రామ్ విజయాలు అందుకున్న చాలా సినిమాలు కూడా కమర్షియల్ సినిమాలు కాకుండా లవ్ , రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ లు గానే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

కొంత కాలం రామ్ పోతినేని ,  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో రామ్ కి మంచి గుర్తింపు లభించింది. దానితో ఈయన వరుసగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలలో హీరో గా నటిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత ఈయన ది వారియర్ , స్కంద తాజాగా డబల్ ఇస్మార్ట్ ఇలా వరుసగా మాస్ కమర్షియల్ సినిమాలలో హీరో గా నటిస్తున్నాడు. కానీ ఈ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

దానితో చాలా మంది ప్రేక్షకులు రామ్ మళ్లీ లవర్ బాయ్ ఈమేజ్ కలిగిన సినిమాలో నటిస్తే బాగుంటుంది. అలాంటి సినిమా ద్వారా ఆయనకు మంచి హిట్ వస్తుంది. మళ్ళీ ఫుల్ కం బ్యాక్ ఇస్తాడు అని చాలా మంది రామ్ అభిమానులు మరియు ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. మరి రామ్ మళ్లీ లవ్ , రొమాంటిక్ , కామెడీ ఎంటర్టైనర్ మూవీలలో నటిస్తాడా ... లేక అపజయాలు వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీల వైపే ఇంట్రెస్ట్ చూపుతాడా అనేది చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>