MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna48b013aa-2ac2-4d76-813d-10f851325603-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna48b013aa-2ac2-4d76-813d-10f851325603-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన కట్టడాలను కూల్చివేసేందుకు రంగంలోకి దిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. హైదరాబాద్ మహానగరంలో అక్రమ కట్టడాలు, చెరువుల జాగాలను కబ్జా చేసి కట్టిన కట్టడాలను కూల్చివేసేందుకు... హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత... ఈ హైడ్రా ఏర్పాటు అయింది. nagarjuna{#}bhaskar,ranganath,Revanth Reddy,Baba Bhaskar,Madhapur,Hero,Hyderabad,Akkineni Nagarjuna,Saturday,Telangana,Telugu,Governmentనాగార్జునకు షాక్‌...బుల్డోజర్లతో రంగంలోకి రేవంత్ సర్కార్ ?నాగార్జునకు షాక్‌...బుల్డోజర్లతో రంగంలోకి రేవంత్ సర్కార్ ?nagarjuna{#}bhaskar,ranganath,Revanth Reddy,Baba Bhaskar,Madhapur,Hero,Hyderabad,Akkineni Nagarjuna,Saturday,Telangana,Telugu,GovernmentSat, 24 Aug 2024 09:09:00 GMTహీరో అక్కినేని నాగార్జునకు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ఆయనకు సంబంధించిన కట్టడాలను కూల్చివేసేందుకు రంగంలోకి దిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. హైదరాబాద్ మహానగరంలో అక్రమ కట్టడాలు, చెరువుల జాగాలను కబ్జా చేసి కట్టిన కట్టడాలను కూల్చివేసేందుకు... హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత... ఈ హైడ్రా ఏర్పాటు అయింది.


ఈ హైడ్రా సంస్థకు ఏవి రంగనాథ్  కమిషనర్ గా  వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటికే ఏవీ రంగనాథ్  ఆధ్వర్యంలో... అనేక అక్రమ కట్టడాలను కూల్చివేసింది హైడ్రా. అయితే తాజాగా అక్కినేని హీరో  నాగార్జున పైన పడింది. మాదాపూర్ ప్రాంతంలో హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసేందుకు హైడ్రాధికారులు రంగంలోకి దిగారు.


ఇందులో భాగంగానే శనివారం ఉదయం జంబో.. మిషన్లతో.. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ ను  కూల్చి వేస్తున్నారు అధికారులు. అయితే ఈ ప్రక్రియ నేపథ్యంలో గొడవలు జరిగే ఛాన్స్ ఉందని ముందే గ్రహించారు హైడ్రాధికారులు. దీంతో అక్కడ భారీగా పోలీసులను బందోబస్తుగా  ఏర్పాటు కూడా చేసుకున్నారు. పోలీసుల సమక్షంలోనే కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు.

 
తమ్మిడి చెరువు.. ఎఫ్ టి ఎల్ పరిధి లో... నాగార్జున నిర్మించిన ఇన్ కన్వెన్షన్ ఉన్న సంగతి తెలి సిందే. అయితే దీన్ని వెంటనే తొలగించాలని జనం కోసం సంస్థ  అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి... హైడ్రా ను ఆశ్రయించారు. ఇక దీనిపై విచారణ చేసిన హైడ్రాధికారులు...  3 ఎకరాల ఎన్ కన్వెన్షన్ ను... తొలగిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయింది. మరి ఈ కూల్చి వేతల పై ఇప్పటి వరకు అక్కినేని నాగార్జున స్పందించలేదు. మరి ఇకనైనా దీనిపై అక్కినేని నాగార్జున స్పందిస్తారా లేదా చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>