PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/satthupally7e509050-4282-49af-8958-912bad886b48-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/satthupally7e509050-4282-49af-8958-912bad886b48-415x250-IndiaHerald.jpgసత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి కాంగ్రెస్ తరపున గెలిచారు. తాను డాక్టర్. ఆమె భర్త మట్టా దయానంద్ ఆయన కూడా డాక్టర్. వారిది మొదటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీ. ప్రారంభం నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు. దయానంద్ తల్లి గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీపీ గా గెలిచారు. దయానంద్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలి... కోరమీనంత మైక్ పట్టుకొని.... అధ్యక్ష అనాలి. దయానంద్ డ్రీమ్ కూడా అదే. కానీ రాజకీయం అంటేనే చాలా కష్టం. పైకి ఎదిగిన కొద్దీ కిందికి లాగేసే వారే ఎక్కువsatthupally{#}Sandra Venkata Veeraiah;రాజీనామా;Scheduled caste;Thota Chandrasekhar;local language;Khammam;Congress;Party;MLA;Husband;YCPసత్తుపల్లి ప్రజలకు శుభవార్త.. ఇకపై వారికి ఇద్దరు ఎమ్మెల్యేలు ?సత్తుపల్లి ప్రజలకు శుభవార్త.. ఇకపై వారికి ఇద్దరు ఎమ్మెల్యేలు ?satthupally{#}Sandra Venkata Veeraiah;రాజీనామా;Scheduled caste;Thota Chandrasekhar;local language;Khammam;Congress;Party;MLA;Husband;YCPFri, 23 Aug 2024 08:01:00 GMT

సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి కాంగ్రెస్ తరపున గెలిచారు. తాను డాక్టర్. ఆమె భర్త మట్టా దయానంద్ ఆయన కూడా డాక్టర్. వారిది మొదటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీ. ప్రారంభం నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు. దయానంద్ తల్లి గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీపీ గా గెలిచారు. దయానంద్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలి... కోరమీనంత మైక్ పట్టుకొని.... అధ్యక్ష అనాలి. దయానంద్ డ్రీమ్ కూడా అదే. కానీ రాజకీయం అంటేనే చాలా కష్టం. పైకి ఎదిగిన కొద్దీ కిందికి లాగేసే వారే ఎక్కువగా ఉంటారు.

అలా సంభాని చంద్రశేఖర్ ను కాదని టికెట్ వచ్చే పరిస్థితి లేదు. దాంతో అతను వైసీపీలో చేరారు. 2014లో ఆ వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కేవలం 2,300 ఓట్లతో సండ్ర వెంకట వీరయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక అప్పటినుంచి పొంగులేటి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. అలా వారిద్దరి స్నేహం కొనసాగింది. పార్టీ మారే క్రమంలో పొంగులేటితో కలిసి ఆనాడు బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందని దయానంద్ ఆశపడ్డారు. కానీ తాను ఒకటి అనుకుంటే అధినేత మరొకటి చేసింది. అక్కడ అతనికి నిరాశ ఎదురయింది.


దయానంద్ ని కాదని పిడమర్తి రవికి టికెట్ ఇచ్చారు. ఇదంతా కాదని ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఇదేదో పెద్ద ఎఫెక్ట్ పడుతుందని భావించిన బీఆర్ఎస్ దయానంద్ ను కూల్ చేసే ప్రయత్నాలు చేసింది. ఎమ్మెల్సీ ఇస్తాం విత్ డ్రా చేసుకోండని బుజ్జగించింది. ఆ హామీతో దయానంద్ వెనక్కి తగ్గారు. తీరా చూస్తే అటు ఎమ్మెల్సీ రాలేదు. ఇటు పోటీ కూడా చేయలేదు. తర్వాత ఎన్నికల్లో కూడా టికెట్ వచ్చే పరిస్థితి కనిపించలేదు. దీంతో గులాబీ కండువా విసిరేసి కాంగ్రెస్ గూటికి చేరారు. ఎమ్మెల్యే కావాలన్నా ఆశతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన దయానంద్ కు రిజర్వేషన్ రూపంలో ఆటంకం ఎదురయ్యింది. తల్లిదండ్రులవి వేరువేరు కులాలు కావడంతో రిజర్వేషన్ మెలిక పడింది.


బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కుమ్ములాటలో భాగంగా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నేత దయానంద్ కు ఎస్సీ సర్టిఫికెట్ రాకుండా అడ్డుకున్నారనే టాక్ ఉంది. ఇది ముందే ఊహించిన దయానంద్ ఇక లాభం లేదనుకొని తన భార్యను రాజకీయాల్లోకి దించారు. ఆమెను ఉద్యోగానికి రాజీనామా చేయించి పొలిటికల్ ఎంట్రీ చేయించారు. పలుకుబడితో రాగమయికి టికెట్ ఇప్పించుకోగలిగారు. కాంగ్రెస్ హవా ఖమ్మం జిల్లాలో ముగ్గురు కీలక నేతల సహకారంతో రాగమయి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆమె గెలిచినప్పటి నుంచి దయానంద్ కు పట్టపగ్గాలు లేవన్నది లోకల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే భర్తనే కదా ఆ మాత్రం హల్చల్ ఉండొచ్చు అని అనుకోవచ్చు. కానీ ఆ డోస్ ఎక్కువ అయిందని ప్రచారం వినిపిస్తోంది. దీంతో ఆ నియోజక వర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు అని చర్చించుకుంటున్నారట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>