Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan37419909-1480-44c7-8e2c-6d24e4f9a6f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan37419909-1480-44c7-8e2c-6d24e4f9a6f5-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రామ్ చరణ్ ఇక ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడిగా కాదు తండ్రికి మించిన తనయుడుగా గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాలో రామరాజు పాత్రలో నటించిన చరణ్ తన నటన విశ్వరూపం ఏంటో చూపించాడు. అంతేకాదు ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించాడు అని చెప్పాలి. ఇక రాంచరణ్ ఎక్కడికి వెళ్లినా కూడా అభిమానులు అందరూ కూడా సెల్ఫీల కోసం ఎగబడెలా చరణ్ క్రేజ్ ప్రస్తుతCharan{#}Ram Charan Teja;ramaraju;Rajamouli;surya sivakumar;GEUM;Comedy;Chiranjeevi;Thriller;Director;ram pothineni;Heroine;Telugu;Cinema;Newsబుచ్చిబాబు సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పేసిన చరణ్.. మొదటిసారి?బుచ్చిబాబు సినిమా కాన్సెప్ట్ ఏంటో చెప్పేసిన చరణ్.. మొదటిసారి?Charan{#}Ram Charan Teja;ramaraju;Rajamouli;surya sivakumar;GEUM;Comedy;Chiranjeevi;Thriller;Director;ram pothineni;Heroine;Telugu;Cinema;NewsFri, 23 Aug 2024 10:30:00 GMTమెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన రామ్ చరణ్ ఇక ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడిగా కాదు తండ్రికి మించిన తనయుడుగా గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమాలో రామరాజు పాత్రలో నటించిన చరణ్ తన నటన విశ్వరూపం ఏంటో చూపించాడు. అంతేకాదు ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించాడు అని చెప్పాలి. ఇక రాంచరణ్ ఎక్కడికి వెళ్లినా కూడా అభిమానులు అందరూ కూడా సెల్ఫీల కోసం ఎగబడెలా చరణ్ క్రేజ్ ప్రస్తుతం పెరిగిపోయింది.


 అయితే ఇక ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత క్రేజీ లైన్ అప్ తో రామ్ చరణ్ ముందుకు సాగుతున్నాడు. మరో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్తో ఒక మూవీ చేస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. గేమ్ చేంజర్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే మరికొన్ని సినిమాలను లైన్లో పెట్టేసాడుఈ మెగా హీరో. ఈ క్రమంలోనే ఉప్పెన సినిమాతో హిట్టు కొట్టిన బుచ్చిబాబుతో ఒక మూవీ చేయబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ కాన్సెప్ట్ ఇదే అంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు అటు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.


 చరణ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కే మూవీస్ స్పోర్ట్స్ జానెర్ లో ఉండబోతుంది అంటూ అందరూ చర్చించుకుంటూ ఉండగా.. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అన్న విషయాన్ని చెప్పేసాడు రామ్ చరణ్. బుచ్చిబాబుతో తాను చేయబోయే సినిమా కామెడీ ప్రధానంగా ఉంటుంది అని ఓ ఇంటర్వ్యూలో చరణ్ తెలిపాడు. మీరు థ్రిల్లర్ ను ఇష్టపడతారా లేకపోతే కామెడీనా అని ప్రశ్నించగా తాను కామెడీ ఎప్పుడు చేయలేదు. కానీ నెక్స్ట్ బుచ్చిబాబుతో చేయబోయే సినిమా ఆ కోవలోనే ఉంటుంది. తనకు ఇష్టమైన నటుడు సూర్య అని, హీరోయిన్ సమంత అంటూ చెప్పుకొచ్చాడు చరణ్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>