PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/anantha-babu21a07121-6139-466d-bf1f-51d843f5be31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/anantha-babu21a07121-6139-466d-bf1f-51d843f5be31-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల్లో వైసిపి ఓడిపోవడానికి... వంద కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్లుగా... జగన్ చేసిన చాలా తప్పిదాల వల్ల ఆయన పార్టీ ఓడిపోయిందని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీలో ఉన్న కొంతమంది... బూతుల నాయకులు, క్రైమ్ రికార్డు ఉన్న నేతల కారణంగా.. వైసిపి అత్యంత దారుణంగా ఓడిపోయిందని చెబుతున్నారు. anantha babu{#}High court;police;Driver;Arrest;Murder.;kakinada;Rajahmundry;Party;CBN;Andhra Pradesh;Jagan;YCPజ‌గ‌న్‌ను ముంచేసిన గ్ర‌హాలు: వైసీపీ పరువు బజారుకిడ్చిన అనంత బాబు ?జ‌గ‌న్‌ను ముంచేసిన గ్ర‌హాలు: వైసీపీ పరువు బజారుకిడ్చిన అనంత బాబు ?anantha babu{#}High court;police;Driver;Arrest;Murder.;kakinada;Rajahmundry;Party;CBN;Andhra Pradesh;Jagan;YCPFri, 23 Aug 2024 07:38:00 GMT* వైసీపీ కొంపముంచిన అనంత బాబు ఎపిసోడ్‌
* డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా అనంతబాబు
* ఎమ్మెల్సీగా ఉండి కూడా హత్య రాజకీయాలు చేసిన అనంత బాబు



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల్లో వైసిపి ఓడిపోవడానికి... వంద కారణాలు  ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్లుగా... జగన్ చేసిన చాలా తప్పిదాల వల్ల ఆయన పార్టీ ఓడిపోయిందని కూడా చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీలో ఉన్న కొంతమంది...  బూతుల నాయకులు, క్రైమ్ రికార్డు ఉన్న నేతల కారణంగా.. వైసిపి అత్యంత దారుణంగా ఓడిపోయిందని చెబుతున్నారు.


ముఖ్యంగా వైసిపి ఎమ్మెల్సీ  అనంత బాబు కూడా... వైసిపి ఓడిపోవడం లో... ముఖ్యుడు అని చెబుతున్నారు.  ఆయన చేసిన హత్య కారణంగా  వైసిపి పార్టీ  చాలా నష్టపోయిందని చెప్పవచ్చు. కాకినాడ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన.. అనంత బాబు...  డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఇరుక్కున్నారు. తన మాజీ డ్రైవర్ అయిన సుబ్రహ్మణ్యం ను... హత్య చేసి జైలు పాలు అయ్యారు ఎమ్మెల్సీ అనంతబాబు.


ఈ సంఘటన ఎన్నికల కంటే ముందు జరగడంతో... వైసిపి పార్టీ తీవ్ర నష్టాన్ని చవిచూసింది. తన డ్రైవర్ను చంపేసి... హత్యగా చేసే కుట్రలు కూడా చేశారట అనంత్ బాబు.  ఇక ఈ కేసులో నిందితుడిగా తేలిన అనంతబాబును పోలీసులు కూడా అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన అనంత్ బాబు.. చాలా రోజుల వరకు రాజమండ్రి జైల్లో జైలు జీవితాన్ని గడిపారు.


ఆ తర్వాత ఆయనకు హైకోర్టు బెల్ కూడా మంజూరు చేయడం జరిగింది. బెయిల్ మంజూరైనప్పటికీ కూడా.. అనంత్ బాబుకు వైసిపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అప్పట్లో ఈ అంశం చాలా వివాదంగా మారింది.  అయితే వైసిపి పార్టీలో హత్యలు చేసే నాయకులు ఉన్నారని మెసేజ్ జనాల్లోకి గట్టిగా వెళ్ళింది. ఇది కూడా జగన్ మోహన్ రెడ్డి కొంపముంచిందని చెప్పవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>