MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani63824a9c-4266-4f78-9a2f-57b38a145aaa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani63824a9c-4266-4f78-9a2f-57b38a145aaa-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం ఈ 29 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. అంటే సుందరానికి చిత్రం తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని హీరో నాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఆగస్టు 24 వ తేదీన హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, నొవోటల్ లో ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. nani{#}atreya;RRR Movie;Hyderabad;Athadu;Posters;GEUM;Pawan Kalyan;Event;Darsakudu;Chitram;Saturday;Mass;surya sivakumar;priyanka;Nani;Director;Hero;Cinema;producer;Producer;Teluguషాకింగ్: ఆ వెబ్ సిరీస్ తీస్తా అంటున్న నాని..!?షాకింగ్: ఆ వెబ్ సిరీస్ తీస్తా అంటున్న నాని..!?nani{#}atreya;RRR Movie;Hyderabad;Athadu;Posters;GEUM;Pawan Kalyan;Event;Darsakudu;Chitram;Saturday;Mass;surya sivakumar;priyanka;Nani;Director;Hero;Cinema;producer;Producer;TeluguFri, 23 Aug 2024 13:25:00 GMTనాచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం ఈ 29 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. అంటే సుందరానికి చిత్రం తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రాన్ని హీరో నాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఆగస్టు 24 వ తేదీన హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్, నొవోటల్ లో ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. విలక్షణ నటుడు ఎస్. జే. సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పై

 ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించాడు. గతంలో ఆర్ఆర్ఆర్ మూవీని తీసిన ఇదే నిర్మాత.. పవన్ కల్యాణ్ తో ఓజీని కూడా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సరిపోదా శనివారం మూవీకి ఉన్న హైప్ నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి దక్కించుకుంది.  మలయాళం సినిమాలకు కొన్నేళ్లుగా సాధారణ తెలుగు ప్రేక్షకులే కాదు ఇక్కడి సెలబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోతున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని చేసిన కామెంట్స్ చూస్తే అదే అనిపిస్తోంది. తన నెక్ట్స్ మూవీ సరిపోదా శనివారం ప్రమోషన్లలో భాగంగా కేరళలోని కొచ్చిలో అతడు మీడియాతో మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మొత్తం ప్రపంచమే మెచ్చిన వెబ్ సిరీస్

 లలో ఒకటి గేమ్ ఆఫ్ థ్రోన్స్. హెచ్‌బీఓ నిర్మించిన ఈ సిరీస్ ను మలయాళంలో తీయాలని అనుకుంటున్నట్లు నాని చెప్పడం విశేషం. ఈ భాషలో తనకు ఎప్పుడైనా ఏదైనా నిర్మించే అవకాశం వస్తే మాత్రం తాను మొదట చేసేది అదే అని అతడు స్పష్టం చేశాడు. మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే మలయాళంలో ఇది చేయడం చాలా సులువు అని కూడా నాని అన్నాడు.అక్కడి ఏ ప్రొడ్యూసర్ అయినా సులువుగా ఎంతో టాలెంట్ ఉన్న నటీనటులను ఒక్కచోట చేర్చగలడని అతడు అభిప్రాయపడ్డాడు. ప్రతి పాత్రకు సముచిత న్యాయంతో బలమైన స్క్రీన్ ప్లే ఉన్నా కూడా తెలుగు లేదా తమిళంలో అలాంటి నటీనటులను ఒక్కచోట చేర్చడం కష్టమని నాని అన్నాడు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>