MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shobitha26ef44ae-1863-4907-88e1-7d7dae43a16d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shobitha26ef44ae-1863-4907-88e1-7d7dae43a16d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. గత నాలుగేళ్ల క్రితం సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. 2017లో ఈ జంట విడాకులు తీసుకున్నప్పటికీ కలుస్తారనే ఆశ ప్రతి ఒక్కరికి ఉండేది. కానీ నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ విషయం తెలిసిన అనంతరం ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. shobitha{#}Akkineni Nagarjuna;prema;marriage;Hero;Naga Chaitanya;shobitha;News;Love;Samanthaశోభిత కుటుంబానికి పెళ్లి ఇష్టం లేదా..ఆ హీరో దగ్గరుండి ఒప్పించారా?శోభిత కుటుంబానికి పెళ్లి ఇష్టం లేదా..ఆ హీరో దగ్గరుండి ఒప్పించారా?shobitha{#}Akkineni Nagarjuna;prema;marriage;Hero;Naga Chaitanya;shobitha;News;Love;SamanthaFri, 23 Aug 2024 08:05:00 GMTటాలీవుడ్‌ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. గత నాలుగేళ్ల క్రితం సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. 2017లో ఈ జంట విడాకులు తీసుకున్నప్పటికీ కలుస్తారనే ఆశ ప్రతి ఒక్కరికి ఉండేది. కానీ నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ విషయం తెలిసిన అనంతరం ప్రతి ఒక్కరూ బాధపడ్డారు.


సమంతతో విడాకుల అనంతరం నాగచైతన్య, శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడడం... రిలేషన్ కొనసాగించడం జరిగింది. కానీ వీరి ప్రేమ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారు. అయితే వీరి ఎంగేజ్మెంట్ జరుపుకోవడానికి ముందు నాగచైతన్య, శోభిత ప్రేమలో ఉన్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే వాటిని శోభిత ఖండించింది. ఈనెల 8వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో నాగార్జున ఇంట్లో శోభిత, నాగచైతన్య ఎంగేజ్మెంట్ చాలా ప్రైవసీగా జరిగింది.


వీరిద్దరికీ తగిన ముహూర్తం కావడంతో దాన్ని వదులుకోకూడదని చాలా హడావిడిగా ఎంగేజ్మెంట్ జరిపించినట్లు అక్కినేని కుటుంబం వెల్లడించారు. అయితే ఈ పెళ్లికి శోభితను, వారి కుటుంబ సభ్యులను నాగార్జున దగ్గరుండి మరి ఒప్పించారట. కొన్ని రోజులపాటు వెయిట్ చేద్దామని శోభిత కుటుంబ సభ్యులు అనుకున్నారట. కానీ మంచి ముహూర్తం కావడంతో హడావిడిగా నాగార్జున బలవంతంగానే శోభిత కుటుంబ సభ్యులను ఒప్పించినట్లు సమాచారం.


ఇంత మంచి ముహూర్తం మళ్ళీ రాదని ఇలాంటి ముహూర్తం కోసం మళ్లీ కొన్ని సంవత్సరాలు ఆగాల్సి వస్తుందని నాగార్జున ఇలా చేశాడని వారి కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. ఇక ఆగస్టు 8వ తేదీన వీరి ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. కానీ వివాహానికి కొన్ని రోజులపాటు గ్యాప్ తీసుకోవాలని నాగచైతన్య, శోభిత అనుకుంటున్నారట. ఇక వీరి వివాహం ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది. కాగా సమంత మాత్రం రెండో పెళ్లి చేసుకోకుండా.. బ్రహ్మాచారిగా ఉండేందుకే నిర్ణయం తీసుకుందని సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>