PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-chandrbabu-super-six-failuer1529fa5a-7895-4c03-a814-3e68f828e012-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-chandrbabu-super-six-failuer1529fa5a-7895-4c03-a814-3e68f828e012-415x250-IndiaHerald.jpgకూటమి లో భాగంగా టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ రెండు నెలలు కావస్తోంది. సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ఆ తర్వాత ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు.. కేవలం త్వరలోనే అంటూ కాలయాపనకు మంత్రులు ముందుకు వెళ్తున్నారు తప్ప మరేలాంటి పథకాలను తీసుకురాలేదు. వీటికి తోడు గత ప్రభుత్వం వైసీపీ పాలన ఏపీని సర్వనాశనం చేసిందనే విధంగా కూటమి పెద్దలైతే తెలియజేస్తున్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ పడిపోయిందనే విధంగా కూడా తెలుపుతున్నారు. కానీ వీటన్నిటినీ మాత్రం ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు.. కేవలం సూపర్ సిక్స్AP CM;CHANDRBABU;SUPER SIX;FAILUER{#}Sex;TDP;Andhra Pradesh;CBN;June;Governmentఏపీ: కూటమి ఉచితలకు స్వస్తి చెప్పినట్టేనా..?ఏపీ: కూటమి ఉచితలకు స్వస్తి చెప్పినట్టేనా..?AP CM;CHANDRBABU;SUPER SIX;FAILUER{#}Sex;TDP;Andhra Pradesh;CBN;June;GovernmentThu, 22 Aug 2024 06:30:00 GMTకూటమి లో భాగంగా టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ రెండు నెలలు కావస్తోంది. సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ఆ తర్వాత ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు.. కేవలం త్వరలోనే అంటూ కాలయాపనకు మంత్రులు ముందుకు వెళ్తున్నారు తప్ప మరేలాంటి పథకాలను తీసుకురాలేదు. వీటికి తోడు గత ప్రభుత్వం వైసీపీ పాలన ఏపీని సర్వనాశనం చేసిందనే విధంగా కూటమి పెద్దలైతే తెలియజేస్తున్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ పడిపోయిందనే విధంగా కూడా తెలుపుతున్నారు. కానీ వీటన్నిటినీ మాత్రం ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు.. కేవలం సూపర్ సిక్స్ హామీలు మాత్రమే అమలు చేయాలనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు.

జూన్ 12న ఏపీలో కొత్త విద్యాసంస్థలు మొదలయ్యాయి ఇప్పటికి విద్యాసంస్థలు మొదలై రెండు నెలలు కావస్తున్నప్పటికీ తల్లికి వందన పథకం గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఎన్నికల ముందు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. కానీ ఎక్కడ ఇప్పుడు ఆ ఊసే లేదు. అలాగే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు.. ఇది కూడా కనిపించడం లేదు. మరొకటి ఏమిటంటే నిరుద్యోగులకు 3000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పినా చంద్రబాబు ఈ హామీను కూడా నెరవేర్చలేదు.


ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ ప్రస్తుతం నడుస్తున్న సమయంలో ప్రతి ఏటా కూడా రైతులకు 20000 ఆర్థిక సహాయం ప్రతీయేట ఇస్తామన్న కూటమి ఇప్పుడు వీటి గురించి కూడా పట్టించుకోలేదు. ప్రస్తుతం పెట్టుబడి సహాయం కింద అవసరమైన కూడా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. సూపర్ సెక్స్ హామీలు అంటే అవన్నీ గాలిలోని మాటలే అన్నట్లుగా మిగిలిపోయాయి. ఈ పథకాలన్నీ అమలు చేయకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ అయిందని మాత్రమే చెబుతున్నారు. దీనికి తోడు టిడిపి నేతలు కూడా ఉచితాలు దండుగా అనే విధంగా డైరెక్ట్ గానే చెప్పేస్తున్నారు. ప్రజల ఖాతాలలో డబ్బులు వేస్తూ ఉంటే వారు పనులు మానేసి మరి బిర్యానిలు తింటున్నారు అనే విధంగా కామెంట్స్ చేస్తున్నారట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>