Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral0cf9eded-3826-47bd-8e00-6f7e7b5e7eeb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viral0cf9eded-3826-47bd-8e00-6f7e7b5e7eeb-415x250-IndiaHerald.jpgసాధారణంగా చిన్నపిల్లలు ఎక్కడ ఉన్నారు. ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలకు ఏది మంచి ఏది చెడు అన్న విషయం తెలియదు. అందుకే కొన్ని కొన్ని సార్లు సరదా కోసం చేసిన పని ఇక ఎన్నో ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు పిల్లలను ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండాలి. లేదంటే అనుకోని ప్రమాదాలు ముంచుకు వస్తూ ఉంటాయి . అయితే ఇక ఇప్పుడు జరిగిన ఘటన గురించి తెలిసిన తర్వాత పిల్లలను ఒంటరిగా వదిలేయాలంటే తల్లిదండ్రులు మరింత భయViral{#}Parents;Bihar;Police Stationబొమ్మ అనుకుని పామును కొరికిన బాలుడు.. చివరికి?బొమ్మ అనుకుని పామును కొరికిన బాలుడు.. చివరికి?Viral{#}Parents;Bihar;Police StationThu, 22 Aug 2024 10:30:00 GMTసాధారణంగా చిన్నపిల్లలు ఎక్కడ ఉన్నారు. ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలకు ఏది మంచి ఏది చెడు అన్న విషయం తెలియదు. అందుకే కొన్ని కొన్ని సార్లు సరదా కోసం చేసిన పని ఇక ఎన్నో ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు పిల్లలను ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూ ఉండాలి. లేదంటే అనుకోని ప్రమాదాలు ముంచుకు వస్తూ ఉంటాయి . అయితే ఇక ఇప్పుడు జరిగిన ఘటన గురించి తెలిసిన తర్వాత పిల్లలను  ఒంటరిగా వదిలేయాలంటే తల్లిదండ్రులు మరింత భయపడిపోతారు.



 సాధారణంగా ఏడాదిన్నర వయస్సు ఉన్న పిల్లాడు కనిపించిన ప్రతి వస్తువును తాకుతూ ఇక చిలిపి పనులు చేస్తూ ఆడుకుంటూ ఉండటం చూస్తూ ఉంటాం. అయితే ఇలాగే ఆడుకుంటున్న ఓ చిన్నారి దగ్గరికి పాము వచ్చింది. అయితే పాము కూడా తన దగ్గర ఉన్న బొమ్మల్లో లాగానే అది కూడా ఒక బొమ్మ అనుకున్నాడు. చివరికి ఆ పాముతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఆ పాము అతనిపై దాడి చేస్తున్న అతను మాత్రం ఆ పామును తన నోటితో కొరుకుతూ చివరికి ఆ పాము ప్రాణాలు తీసేసాడు. అయితే ఆ తర్వాత అక్కడ జరిగిన ఘటన గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి.


 బీహార్ లోని గయాలో ఫతేపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జమహర్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడాదిన్నర వయస్సు ఉన్న చిన్నారి ఇంటి టెర్రస్ పైన ఆడుకుంటున్నాడు. ఇందులో మూడు అడుగుల పొడవున్న ఒక పాము అటువైపుగా వచ్చింది. అయితే ఆ పామునూ కూడా ఆడుకునే బొమ్మ అనుకున్నాడు ఆ చిన్నారి. చివరికి ఆ పాము నడుము బాగాన్ని తన నోటితో పట్టుకుని నమలడం ప్రారంభించాడు. చివరికి ఆ పిల్లవాడి చేసిన పనికి ఆ పాము ప్రాణాలు వదిలింది. ఆ తర్వాత ఇది గమనించిన తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పామును వెంటనే ఇంటి బయట పడేసి వెంటనే ఆ చిన్నారిని తీసుకొని ఆసుపత్రికి పరుగులు పెట్టారు. అయితే ఆ పాము ఫోటోను చూసిన రైతులు అది విషపూరితమైన ప్రాము కాదని కాటు వేసిన ఏమి కాదని చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
">







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>