MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalkic8023fa5-8ad5-4668-9931-fd2ef630c63e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalkic8023fa5-8ad5-4668-9931-fd2ef630c63e-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ప్రేక్షకులు అంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రం "కల్కి 2898 ఎడి". పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీపికా పదుకునే, దిశా పటాని ఫీమేల్ లీడ్ లో నటించగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ నటినటులు ఇందులో ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం కాబోతుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు ఆనందంతో ఉప్పొంగుతున్నారు. ప్రభాస్ నటించిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుండి kalki{#}disha patani;malavika mohanan;nidhi;vishwa;NET FLIX;maruti;Amazon;vivek;Amitabh Bachchan;raja;vijay kumar naidu;Darsakudu;Telugu;Chitram;Audience;India;Director;Cinema;Prabhas;Populationకల్కి 2898 ఎడి: రెండు ఓటీటీల్లో సంచలనం!కల్కి 2898 ఎడి: రెండు ఓటీటీల్లో సంచలనం!kalki{#}disha patani;malavika mohanan;nidhi;vishwa;NET FLIX;maruti;Amazon;vivek;Amitabh Bachchan;raja;vijay kumar naidu;Darsakudu;Telugu;Chitram;Audience;India;Director;Cinema;Prabhas;PopulationThu, 22 Aug 2024 15:31:48 GMTతెలుగు సినీ ప్రేక్షకులు అంతా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న భారీ బడ్జెట్ చిత్రం "కల్కి 2898 ఎడి". పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో దీపికా పదుకునే, దిశా పటాని ఫీమేల్ లీడ్ లో నటించగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ నటినటులు ఇందులో ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారం కాబోతుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు ఆనందంతో ఉప్పొంగుతున్నారు. ప్రభాస్ నటించిన ఈ

 చిత్రం విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంది. కాగా ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన విషయం తెలిసిందే. దానితో  సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని కూడా దర్శకుడు  అద్భుతంగా తెరకెక్కించాడు. ఇకపోతే కల్కి 2898 ఎడి అనేది భవిష్యత్తు నేపథ్యంలో సాగే ఒక ఫాంటసీ యాక్షన్ చిత్రం. ఈ సినిమాలో ప్రభాస్ ఒక శక్తవంతమైన వీరుడిగా కనిపిస్తాడు. ఇక ఈ సినిమా భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో విడుదల కావడంతో ప్రేక్షకులకు పండగే. కాగా ఈ సినిమాని మేకర్స్ ప్రముఖ స్ట్రీమింగ్ యాప్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్

 ఫ్లిక్స్ లకు అమ్మగా వీటిలో ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం నేటి నుంచి తెలుగు సహా ఇతర సౌత్ భాషల్లో అందుబాటులోకి  వచ్చింది.  దానితో పాటు నెట్ ఫ్లిక్స్ లో నేటి నుంచి ఈ మూవీ హిందీలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయాలి అనుకునేవారు  అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ కల్కి సినిమా తర్వాత మరో  ది రాజా సాబ్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.  మారుతి రచన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కింద టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ పలు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>