MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichandh-malineniebb7fe78-24c8-4120-a0ba-5f42279c32aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopichandh-malineniebb7fe78-24c8-4120-a0ba-5f42279c32aa-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో గోపీచంద్ మలినేని ఒకరు. ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలుకు దర్శకత్వం వహించగా అందులో ఎక్కువ శాతం మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. ఆఖరుగా ఈ దర్శకుడు నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని రూపొందించాడు. పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించారు. ఇకపోతే ఇదే బ్యానర్ లో రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తన తదుgopichandh malineni{#}Sunny Deol;Makar Sakranti;Ravi;Simha;lion;Darsakudu;ravi teja;bollywood;Industry;Director;Hero;Cinemaహీరో బాలీవుడ్.. విలన్ బాలీవుడ్.. గోపీచంద్ మలినేని పెద్ద ప్లానే వేశాడుగా..?హీరో బాలీవుడ్.. విలన్ బాలీవుడ్.. గోపీచంద్ మలినేని పెద్ద ప్లానే వేశాడుగా..?gopichandh malineni{#}Sunny Deol;Makar Sakranti;Ravi;Simha;lion;Darsakudu;ravi teja;bollywood;Industry;Director;Hero;CinemaThu, 22 Aug 2024 11:50:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో గోపీచంద్ మలినేని ఒకరు. ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలుకు దర్శకత్వం వహించగా అందులో ఎక్కువ శాతం మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. ఆఖరుగా ఈ దర్శకుడు నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని రూపొందించాడు. పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించారు.

ఇకపోతే ఇదే బ్యానర్ లో రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తన తదుపరి మూవీ ని అనౌన్స్ చేశాడు. అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా క్యాన్సిల్ అయింది. దానితో రవితేజ వేరే మూవీ చూసుకున్నాడు. ఇక రవితేజ తో మూవీ క్యాన్సిల్ అయిన తర్వాత కొంత కాలం పాటు వెయిట్ చేసిన ఈయన బాలీవుడ్ హీరోలలో ఒకరు అయినటువంటి సన్నీ డియోల్ హీరోగా మూవీ ని ఓకే చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. సన్నీ డియోల్ కి కొంత కాలం పాటు పెద్ద విజయాలు లేవు.

పోయిన సంవత్సరం విడుదల అయిన "గదర్ 2" మూవీ తో ఈయన మంచి విజయాన్ని అందుకొని ఫామ్ లోకి వచ్చాడు. ఇకపోతే ఈ సినిమా నుండి తాజాగా మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో మరో బాలీవుడ్ స్టార్ భాగం అయ్యాడు. ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈయన ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ సినిమాలో హీరో , విలన్ ఇద్దరు కూడా బాలీవుడ్ నటులే అని సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>