MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood57112cc4-b4c8-4d46-b090-257c757c7e5c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood57112cc4-b4c8-4d46-b090-257c757c7e5c-415x250-IndiaHerald.jpgతమిళ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి లీడ్ రోల్‌లో నటించిన తాజా మూవీ ‘మహారాజ’. ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దర్శకుడు నితిలన్ స్వామినాథన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఇకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లతో దుమ్ము లేపింది. ఇక ఇది కాసేపు పక్కన పెడితే సినీ ప్రపంచంలో ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రేక్షకుల చూసే విధానంలో భారీ మార్పు వచ్చింది. థియేటర్లకు వెళ్లకుండానే ఇంట్లోనే కూర్చుని తమకు నచ్చిన tollywood{#}abhirami;Mamta Mohandas;swaminathan;vijay sethupathi;Music;Tamil;Darsakudu;history;Chitram;News;Audience;Fidaa;Director;Cinemaఓటీటీ ప్రపంచాన్ని కలకలం చేస్తున్న ‘మహారాజ’!ఓటీటీ ప్రపంచాన్ని కలకలం చేస్తున్న ‘మహారాజ’!tollywood{#}abhirami;Mamta Mohandas;swaminathan;vijay sethupathi;Music;Tamil;Darsakudu;history;Chitram;News;Audience;Fidaa;Director;CinemaThu, 22 Aug 2024 15:10:00 GMTతమిళ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి లీడ్ రోల్‌లో నటించిన తాజా మూవీ ‘మహారాజ’. ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.  దర్శకుడు నితిలన్ స్వామినాథన్ ఈ చిత్రాన్ని  అద్భుతంగా తెరకెక్కించారు. ఇకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్ల  వసూళ్లతో దుమ్ము లేపింది. ఇక ఇది కాసేపు పక్కన పెడితే సినీ ప్రపంచంలో ఓటీటీలు వచ్చిన తర్వాత ప్రేక్షకుల చూసే విధానంలో భారీ మార్పు వచ్చింది. థియేటర్లకు వెళ్లకుండానే ఇంట్లోనే కూర్చుని తమకు నచ్చిన

 సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసే అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాలు కూడా భారీ అంచనాలతో వస్తున్నాయి. ఇలాంటి సినిమాల్లో తాజాగా ఓటీటీలో రికార్డులు బ్రేక్ చేస్తున్న  సినిమాలలో ఒకటి ‘మహారాజ్’. కాగా ‘మహారాజ’ చిత్రం 2024లోనే నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షింపబడ్డ సినిమాగా నిలిచింది. ఏకంగా 18.6 మిలియన్ వ్యూస్‌తో ఈ సినిమా టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇక విజయ్ సేతుపతి లీడ్ రోల్‌లో నటించిన  సినిమా ఓటీటీలో రికార్డులు బ్రేక్ చేయడం ద్వారా ఓటీటీ పరిశ్రమలో కొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమా విజయం

 ఇతర నిర్మాతలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే తమిళ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి తన అద్భుతమైన నటనతో ఈ సినిమాకు ప్రాణం పోశాడు అని చెప్పవచ్చు.ఆయన పోషించిన పాత్రకు ప్రేక్షకులు అంతా ఫిదా అయ్యారు. ఇక మహారాజ సినిమాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నటరాజ్, భారతీరాజా, అభిరామి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అంతే కాకుండా అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. ఇకపోతే దర్శకుడు నిథిలన్ స్వామినాధన్ తన రెండవ సినిమాను నాయనతార ముఖ్యపాత్రలో చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>