MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/orange-movie-108f7ac6-c930-47bd-88a8-001ddc2bc2d5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/orange-movie-108f7ac6-c930-47bd-88a8-001ddc2bc2d5-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాంటి వాటిలో ఆరెంజ్ సినిమా ఒకటి. మగధీర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ నటన, సినిమా స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. orange movie {#}Swati;prema;swathi;Yash;Magadheera;Bommarillu;Masala;cinema theater;Blockbuster hit;Dil;Pawan Kalyan;Hindi;Success;Ram Charan Teja;Tollywood;House;Father;Love;Cinemaఆరెంజ్ మూవీలోని ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?ఆరెంజ్ మూవీలోని ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?orange movie {#}Swati;prema;swathi;Yash;Magadheera;Bommarillu;Masala;cinema theater;Blockbuster hit;Dil;Pawan Kalyan;Hindi;Success;Ram Charan Teja;Tollywood;House;Father;Love;CinemaThu, 22 Aug 2024 08:52:21 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాంటి వాటిలో ఆరెంజ్ సినిమా ఒకటి. మగధీర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత రామ్ చరణ్ నటించింది ఆరెంజ్ సినిమా. అయితే.. ఈ మూవీ పెద్దగా ఆడలేదని చెప్పవచ్చును. కానీ ఈ సినిమాలో రామ్ చరణ్ నటన, సినిమా స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

థియేటర్స్ లో పెద్దగా హిట్ కాలేకపోయినప్పటికీ ఈ సినిమా టీవీల్లో సూపర్ హిట్ అయింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అప్పుడు థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇటీవలే రీ రిలీజ్ చేశారు. ఆరెంజ్ మూవీ అనగానే ప్రతి ఒక్కరికి మొదటగా గుర్తుకు వచ్చే పాటలను "రూబా రూబా హే రూబా రూబ్బా" ఈ పాటలో చెర్రీకి జోడిగా నటించిన యాక్టర్ ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది.


ఇందులో రూబాగా చెర్రీకి ప్రియురాలిగా షాజన్ పదంసీ నటించింది. ఈ సినిమాలో తన నటనతో యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది షాజన్. ఈమె ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నటి. ఆమె తండ్రి ఫిల్మ్ మేకర్ అలీక్ పదంసి, తల్లి పాప్ సింగర్. తన తండ్రి అడుగుజాడల్లోనే థియేటర్ ఆర్టిస్ట్ గా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. అలా షాజన్ యష్ రాజ్ ఫిల్మ్స్ రాకెట్ సింగ్ సెల్స్ మెన్ ఆఫ్ ది ఇయర్ మూవీ ఆఫర్ వచ్చింది.


ఆ తర్వాత తమిళంలో జై, స్వాతి నటించిన కనిమోళిలో కూడా నటించింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆరెంజ్ మూవీ డిజాస్టర్ కావడంతో హిందీ సినిమాల్లోకి వెళ్లిపోయింది. అక్కడ దిల్ తో బచ్చా హై జీ, హౌస్ ఫుల్ 2 వంటి చిత్రాలతో ఫేమస్ అయిపోయింది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మసాలా సినిమాతో మన ముందుకు వచ్చింది. కానీ మళ్ళీ అనుకున్న మేర సక్సెస్ సాధించలేదు. షాజన్ కి మళ్ళీ నిరాశే ఎదురైంది. సాలిడ్ పటేల్స్ సినిమా తర్వాత ఎనిమిదేళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>