Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee9bd8fcb-4ee3-4e87-b357-71782aa250e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee9bd8fcb-4ee3-4e87-b357-71782aa250e2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో చిరంజీవి ఒకరు.ఈయన ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు.చిరంజీవి కెరియర్ లో ఎన్నో కుటుంబ కథా చిత్రాలతో పాటు యాక్షన్స్ సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా చిరంజీవి నటించిన యాక్షన్ సినిమాలలో ఇంద్ర సినిమా కూడా ఒకటి.చిరంజీవి ఆర్తి అగర్వాల్ సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.అప్socialstars lifestyle{#}aarti agarwal;Nagababu;Annayya;indra;Father;Manam;sree;Success;Hero;Chiranjeevi;Director;Cinemaనాగ బాబు : ఇంద్ర సినిమాకు ముందు అన్నయ్య చెప్పిన మాట ఎప్పటికీ మర్చిపోలేను..!!నాగ బాబు : ఇంద్ర సినిమాకు ముందు అన్నయ్య చెప్పిన మాట ఎప్పటికీ మర్చిపోలేను..!!socialstars lifestyle{#}aarti agarwal;Nagababu;Annayya;indra;Father;Manam;sree;Success;Hero;Chiranjeevi;Director;CinemaThu, 22 Aug 2024 14:00:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో చిరంజీవి ఒకరు.ఈయన ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు.చిరంజీవి కెరియర్ లో ఎన్నో కుటుంబ కథా చిత్రాలతో పాటు యాక్షన్స్ సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా చిరంజీవి నటించిన యాక్షన్ సినిమాలలో ఇంద్ర  సినిమా కూడా ఒకటి.చిరంజీవి ఆర్తి అగర్వాల్ సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.అప్పట్లో ఇండస్ట్రీలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా ఆగస్టు 22వ తేదీ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఈ క్రమంలోనే ఈ సినిమా తిరిగి విడుదలవుతున్న నేపథ్యంలో ఇంద్ర సినిమా గురించి నాగబాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంద్ర చిత్రం అప్పటి ఇంకా ఖరారు కాక ముందు.. చిరంజీవి, నాగబాబు మధ్య ఆసక్తికర సంఘటన జరిగిందట. ఈ విషయాన్ని నాగబాబు అభిమానులతో పంచుకున్నారు.

ఇంద్ర చిత్రానికి ముందు చిరంజీవి నటించిన మృగరాజు, శ్రీ మంజునాథ, డాడీ లాంటి చిత్రాలు వర్కౌట్ కాలేదు. చిరంజీవి తన కెరీర్ లో చాలా సార్లు ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డారు. ఆ టైంలో కూడా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంద్ర చిత్రం ఇంకా ఖరారు కాలేదు.కొందరు దర్శకులు, నిర్మాతలతో చిరంజీవి చర్చలు జరుపుతున్నారట. ఆ సమయంలో నాగబాబు చిరంజీవి దగ్గరకి వెళ్లారట. చిరు వ్యాయామాలు చేస్తుండగా.. ఒక డైరెక్టర్ గురించి చెప్పారు. ఆ టైంలో సదరు డైరెక్టర్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ముట్టుకుంటే సూపర్ హిట్ పడుతోంది. అన్నయ్య ఒక డైరెక్టర్ ఉన్నాడు.. వరుసగా హిట్లు కొడుతున్నాడు.అన్నయ్య నువ్వు ఆ డైరెక్టర్ ని పిలిచి అతడితో సినిమా చేయొచ్చు కదా.. మంచి హిట్లు ఇస్తున్నాడు అని చెప్పా. అప్పుడు అన్నయ్య ఒక అద్భుతమైన మాట చెప్పారు. సక్సెస్ వెనుక మనం పడకూడదు. మనమే సక్సెస్ ని క్రియేట్ చేయాలి అని అన్నారు. ఆ డైరెక్టర్ తో సినిమా చేస్తే సక్సెస్ వస్తుందేమో.. కానీ నాకు అది అవసరం లేదు.ఆ డైరెక్టర్ కూడా నేను చాలా గొప్ప డైరెక్టర్ ని అనే యాటిట్యూడ్ ప్రదర్శించే వాడు. అది ఆయన నమ్మకం తప్పులేదు. అన్నయ్యతో నేను మాట్లాడిన నెల రోజులకి ఇంద్ర చిత్రం ఒకే అయింది. అన్నయ్య చెప్పినట్లుగానే అద్భుతమైన హిట్ కొట్టారు. అప్పటి నుంచి సినిమాల విషయంలో అన్నయ్యకి నేను ఎప్పుడూ సలహాలు ఇవ్వను. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు అని నాగబాబు అన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>