MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇంట పెళ్లి భాజాలు మోగడం మొదలయ్యాయి. మరికొద్ది గంటల్లోనే ఈ హీరో తన ప్రియురాలు రహస్య గోరఖ్ మెడలో మంగళసూత్రం కట్టనున్నాడు. ఆమెతో కలిసి ఏడు అడుగులు నడవనున్నాడు. నిజానికి వీళ్ళిద్దరూ కో-యాక్టర్స్. "రాజా వారు రాణి గారు (2019)" సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ షూటింగ్ సెట్స్ లో వీరి మధ్య ఏర్పడిన పరిచయం తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు వారి పెళ్లికి కూడా దారి తీసింది. Kiran Abbavaram {#}rani;vishnu;Coorg;thursday;Beautiful;media;marriage;Tollywood;kiran;prema;Love;Heroకిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ వెడ్డింగ్ ఫొటోస్ వైరల్.. చూస్తే ఫిదా..కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ వెడ్డింగ్ ఫొటోస్ వైరల్.. చూస్తే ఫిదా..Kiran Abbavaram {#}rani;vishnu;Coorg;thursday;Beautiful;media;marriage;Tollywood;kiran;prema;Love;HeroWed, 21 Aug 2024 10:11:00 GMTఎస్ఆర్ కళ్యాణ మండపం, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇంట పెళ్లి భాజాలు మోగడం మొదలయ్యాయి. మరికొద్ది గంటల్లోనే ఈ హీరో తన ప్రియురాలు రహస్య గోరఖ్ మెడలో మంగళసూత్రం కట్టనున్నాడు. ఆమెతో కలిసి ఏడు అడుగులు నడవనున్నాడు. నిజానికి వీళ్ళిద్దరూ కో-యాక్టర్స్. "రాజా వారు రాణి గారు (2019)" సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ షూటింగ్ సెట్స్ లో వీరి మధ్య ఏర్పడిన పరిచయం తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు వారి పెళ్లికి కూడా దారి తీసింది.

గురువారం అంటే ఆగస్టు 22న కర్ణాటక రాష్ట్రం, కూర్గ్ జిల్లాలో కిరణ్, రహస్యల పెళ్లి వేడుకలు జరగనున్నాయి. వీరిద్దరి పెళ్ళికి ఘనంగా ఏర్పాట్లు కూడా చేసినట్లు సమాచారం. రీసెంట్ గానే వధూవరులతో పాటు సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడా ఇప్పుడు కూర్గ్ జిల్లాలోని వెడ్డింగ్ వెన్యూకు చేరుకున్నారు. అయితే ఈ ముచ్చటైన జంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంబరాన్ని అంటుతున్నాయి. ఆ సెలబ్రేషన్స్ ఫోటోలు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ ప్రేమ పక్షులు తమ అత్యంత ముఖ్యమైన ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు తమ అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటున్నారు.

తాజాగా వధువు రహస్య, వరుడు కిరణ్ అబ్బవరం క్యూట్ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో ఈ సెలబ్రిటీ కపుల్స్ పెళ్లి దుస్తుల్లో చాలా అందంగా కనిపిస్తూ వావ్ అనిపించారు. మరి ముఖాలపై సిగ్గుమొగ్గలేసింది. పెళ్లి దుస్తుల్లో మురిసిపోతూ దిగిన వారి ఫోటోలు ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా సైట్స్ లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్లికి చాలామంది సినీ సెలబ్రిటీలు హాజరవుతున్నారని సమాచారం. మరోవైపు  అభిమానులు నెటిజన్లు కాబోయే ఈ దంపతులకు బ్యూటిఫుల్ విషెస్ పంపుతున్నారు. రేపు పెళ్లి బంధంతో ఒక్కటైన తర్వాత వీరి బ్యూటిఫుల్ ఫోటోలు వీడియోలు బయటకు వస్తాయి వాటికోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>