PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/siddipet-harish-rao06fde7fe-20ba-4bd2-91c8-485e7dca9910-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/siddipet-harish-rao06fde7fe-20ba-4bd2-91c8-485e7dca9910-415x250-IndiaHerald.jpg ఆ తర్వాత 2004లోను మరోసారి ఆయన సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కరీంనగర్ ఎంపీగా కొనసాగుతూ సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హరీష్ రావుకు అప్పగించారు. నాటి నుంచి నేటి వరకు హరీష్ రావు సిద్దిపేటలో తన కంచుకోటగా మార్చుకున్నారు. ప్రతి ఎన్నికకు తన మెజార్టీ పెంచుకుంటూ వస్తున్నారు. ఏకంగా 1,20,000 ఓట్ల మెజార్టీతో కూడా గెలిచి సరికొత్త రికార్డు సృష్టించారు. సిద్దిపేట అంటే హరీష్ రావు కంచుకోట అయిపోయింది. అలాంటి కంచుకోటలో ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికలలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. siddipet harish rao{#}Medak;MLAసిద్ధిపేట‌లో హ‌రీష్‌రావుకు ఇన్నాళ్ల‌కు స‌రైన మొగుడు త‌గిలాడు...?సిద్ధిపేట‌లో హ‌రీష్‌రావుకు ఇన్నాళ్ల‌కు స‌రైన మొగుడు త‌గిలాడు...?siddipet harish rao{#}Medak;MLAWed, 21 Aug 2024 13:10:11 GMTసిద్దిపేట గత కొన్ని దశాబ్దాలుగా కెసిఆర్ ఫ్యామిలీకి కంచి కోట‌గా ఉంటూ వస్తోంది. కెసిఆర్ సిద్దిపేట నుంచి వరుసగా ఎమ్మెల్యేగా విజ‌యాలు సాధిస్తూ వచ్చారు. 2001లో ఆయన బిఆర్ఎస్ పార్టీని స్థాపించి అక్కడే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2004లోను మరోసారి ఆయన సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కరీంనగర్ ఎంపీగా కొనసాగుతూ సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి హరీష్ రావుకు అప్పగించారు. నాటి నుంచి నేటి వరకు హరీష్ రావు సిద్దిపేటలో తన కంచుకోటగా మార్చుకున్నారు. ప్రతి ఎన్నికకు తన మెజార్టీ పెంచుకుంటూ వస్తున్నారు. ఏకంగా 1,20,000 ఓట్ల మెజార్టీతో కూడా గెలిచి సరికొత్త రికార్డు సృష్టించారు. సిద్దిపేట అంటే హరీష్ రావు కంచుకోట అయిపోయింది. అలాంటి కంచుకోటలో ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికలలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.


మెదక్ పార్లమెంటుకు పోటీ చేసిన బిఆర్ఎస్ అభ్యర్థికి సిద్దిపేట నుంచి కేవలం 1500 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. అప్పుడే సిద్దిపేటలో హరీష్ రావు ఎదురుదెబ్బ తగిలించుకున్నారన్న విమర్శలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు రాజకీయంగా సిద్దిపేటలో హరీష్ రావుకు అసలు సిసలు మొగుడు తగిలాడు ఆయనే మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. తాజాగా మైనంపల్లి సిద్దిపేటలో సభ నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ సభకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో సభలో పాల్గొనేందుకు మైనంపల్లి హైదరాబాద్ నుంచి 200 కార్ల కాన్వాయ్‌తో సిద్దిపేటకు బయలుదేరారు.


అదే సమయంలో బీఆర్ఎస్ కూడా పోటీ సమావేశానికి పిలుపు ఇచ్చింది. రుణమాఫీపై కాంగ్రెస్ మోసం చేసింది అంటూ బీఆర్ఎస్ పిలుపు ఇచ్చిన పోలీసులకు ఈ సభకు అనుమతి నిరాకరించారు. రుణమాఫీపై రాష్ట్ర వ్యాప్తంగా వారు నడుస్తున్న వేళ ... ఇరు పార్టీలు సిద్దిపేటలో సమావేశం ఏర్పాటు చేయటం రాష్ట్రవ్యాప్తంగా హైలెట్ అయింది. అయితే ఈ ఎన్నికలకు ముందు నుంచి హనుమంతరావు సిద్దిపేటలో హరీష్ రావు అంతు చూస్తాను అంటూ వార్నింగ్‌లు ఇస్తూ వస్తున్నారు. రాజకీయంగా హనుమంతరావును నానా ఇబ్బందులు పెడుతూ వచ్చారు.


హరీష్ రావు దీంతో ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొని మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓడిపోగా హనుమంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్ మాత్రం మెదక్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే వచ్చే ఎన్నికలలో హనుమంతరావు సిద్దిపేట నుంచి పోటీ చేసినా ఆశ్చర్యపోకర్లేదని ...రేవంత్ రెడ్డి .. హనుమంతరావును సిద్దిపేట పై గట్టిగా ఫోకస్ చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా సిద్దిపేటలో ఇన్నాళ్లకు హరీష్ రావుకు అసలు సిసలు మొగుడు దొరికాడంటూ తెలంగాణ రాజకీ వర్గాలలో బాగా హాట్‌ టాపిక్ గా మారాడు మైనంపల్లి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>