PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-panchayat-governance-those-three-cms-are-the-real-heroesaad6d7ba-925f-4b3b-88b3-c871127a893f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-panchayat-governance-those-three-cms-are-the-real-heroesaad6d7ba-925f-4b3b-88b3-c871127a893f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఓటమికి కారణమేంటనే ప్రశ్నకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు కూడా ఒక కారణమని చెప్పడంలో ఏ సందేహం అవసరం లేదు. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ను అభిమానించే వాళ్లలో చాలామంది వైఎస్సార్ కు సైతం అభిమానులుగా ఉన్నారు. జగన్ సైతం సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎప్పుడూ విమర్శలు చేసిన సందర్భాలు అయితే లేవనే సంగతి తెలిసిందే. ntr health university{#}Y. S. Rajasekhara Reddy;రాజీనామా;Yarlagadda Venkatrao;YCP;NTR;TDP;students;Jagan;Andhra Pradesh;Application;Teluguవైసీపీ పరువు తీసిన ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు.. ఒక్క తప్పుతో ఎన్ని విమర్శలో?వైసీపీ పరువు తీసిన ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు.. ఒక్క తప్పుతో ఎన్ని విమర్శలో?ntr health university{#}Y. S. Rajasekhara Reddy;రాజీనామా;Yarlagadda Venkatrao;YCP;NTR;TDP;students;Jagan;Andhra Pradesh;Application;TeluguWed, 21 Aug 2024 09:35:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఓటమికి కారణమేంటనే ప్రశ్నకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు కూడా ఒక కారణమని చెప్పడంలో ఏ సందేహం అవసరం లేదు. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ను అభిమానించే వాళ్లలో చాలామంది వైఎస్సార్ కు సైతం అభిమానులుగా ఉన్నారు. జగన్ సైతం సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎప్పుడూ విమర్శలు చేసిన సందర్భాలు అయితే లేవనే సంగతి తెలిసిందే.
 
గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయం విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అయితే తన పదవికి ఏకంగా రాజీనామా చేయడం జరిగింది. చంద్రబాబు, బాలయ్య, లోకేశ్, ప్రముఖ టీడీపీ నేతలు ఆ సమయంలో జగన్ ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఈ ఒకే ఒక్క తప్పు వైసీపీని ముంచేసింది.
 
జగన్ వర్సిటీల పేర్లు మార్చడం అర్థం లేని చర్య అని ఈ విధంగా చేయడం వల్ల విద్యార్థులు తమ సర్టిఫికెట్ల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో, ఉద్యోగుల బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ సమయంలో పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే టీడీపీ నేతలు ఎంత దూకుడుగా వ్యవహరించినా పరిస్థితి మాత్రం మారలేదు.
 
ఎన్టీఆర్ వర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ వర్సిటీగా పేరు మార్చగా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా పునరుద్ధరిస్తూ ఏపీ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టగా బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం లభించడం గమనార్హం. అధికారం ఉందనే గర్వంతో యూనివర్సిటీల పేర్లు మారిస్తే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుతో ప్రూవ్ అయింది. వైసీపీ చేసిన తప్పులు తమ పాలనలో జరగకుండా కూటమి జాగ్రత్త పడుతోంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>