MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-bossef0057de-ff34-4ac9-880a-2357b00cf6b3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigg-bossef0057de-ff34-4ac9-880a-2357b00cf6b3-415x250-IndiaHerald.jpgబిగ్‌బాస్ సీజన్ 8 ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అందింది. తాజాగా స్టార్ మా యాజమాన్యం సీజన్-8 లాంచ్ డేట్ అనౌన్స్‌ చేసింది. ఈసారి ఈ షోకు ఎవరు వస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. బర్రెలక్క, కుమారి ఆంటీ, వేణు స్వామి విష్ణు, విష్ణుప్రియ లాంటి ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియా స్టార్స్ ఇందులో సందడి చేయబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది. దాంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగిపోయింది. bigg boss{#}Akkineni Nagarjuna;Tollywood;Bigboss;monday;sunday;september;Episode;Friday;Evening;Good news;Reality Show;Star maa;House;Good Newwz;Rekha Vedavyas;Yevaru;Venu Thottempudi;mediaబిగ్‌బాస్ ప్రియులకు గుడ్‌న్యూస్.. సీజన్-8 లాంచ్ డేట్ అనౌన్స్‌డ్‌..బిగ్‌బాస్ ప్రియులకు గుడ్‌న్యూస్.. సీజన్-8 లాంచ్ డేట్ అనౌన్స్‌డ్‌..bigg boss{#}Akkineni Nagarjuna;Tollywood;Bigboss;monday;sunday;september;Episode;Friday;Evening;Good news;Reality Show;Star maa;House;Good Newwz;Rekha Vedavyas;Yevaru;Venu Thottempudi;mediaWed, 21 Aug 2024 17:05:00 GMTబిగ్‌బాస్ సీజన్ 8 ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అందింది. తాజాగా స్టార్ మా యాజమాన్యం సీజన్-8 లాంచ్ డేట్ అనౌన్స్‌ చేసింది. ఈసారి ఈ షోకు ఎవరు వస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. బర్రెలక్క, కుమారి ఆంటీ, వేణు స్వామి , విష్ణుప్రియ లాంటి ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియా స్టార్స్ ఇందులో సందడి చేయబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది. దాంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగిపోయింది.

ఈ బుల్లితెర రియాలిటీ షో తెలుగులో ఇప్పటికే 7 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. బిగ్ బాస్ 8వ సీజన్ తో మరింత ఆసక్తికరంగా ఉండబోతుందని నాగార్జున ఇంతకుముందు చెప్పారు ఈసారి కూడా ఆయనే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈ టాలీవుడ్ కింగ్ రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమోని కూడా రిలీజ్ చేశారు. దాంతో హైబ్స్ బాగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 8 లాంచ్ చేసే డేట్ ని నిర్వాహకులు రివీల్ చేశారు. మరో ప్రోమోని విడుదల చేసి ఆ విషయాన్ని తెలియజేశారు.

ఈ అఫీషియల్ ప్రోమోలో చెప్పినట్లుగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 1న ఆదివారం అవుతోంది. ఈరోజు అందరికీ దాదాపు సెలవు దినం అవుతుంది. ఇదే రోజు సాయంత్రం 7 గంటలకు బీబీ 8 గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ ప్రసారం కానుంది. అంటే ఇంకా పది రోజులు ఓపిక పడితే ఇక ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఆ రోజే హౌజ్‌లోకి ఎవరెవరు అడుగు పెడతారో కూడా తెలిసిపోతుంది. ఈ లాంచ్ ఎపిసోడ్ తర్వాత సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ రాత్రి 9.30 గంటలకు బిగ్ బాస్ ప్రసారమవుతుంది. శని, ఆదివారాల్లో మాత్రం రాత్రి 9 గంటలకే ఈ షో స్టార్ట్ అవుతుంది. స్టార్ మా ఛానల్ తో పాటు డిస్నీ హాట్ స్టార్ లో ఈ ఎపిసోడ్స్ చూడవచ్చు.

 అయితే ప్రస్తుతానికి రీతూ చౌదరి, యాంకర్ విష్ణుప్రియ, కుమారి ఆంటీ, యాదమ్మ రాజు, బర్రెలక్క, ఓ సెలబ్రిటీ కపుల్, నటి రేఖ భోజ్.. ఇలా పలువురు ఈసారి కచ్చితంగా హౌస్ లో అడుగు పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మరి వీళ్లల్లో ఎవరు బిగ్ బాస్ కి అడుగు పెడతారో తెలియాలంటే ఇంకొక పది రోజులు ఆగక తప్పదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>