PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jatiya-media-pye-ghatuga-spandhinchina-ycpd3efd537-4126-4503-a3c2-04e121129e7d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jatiya-media-pye-ghatuga-spandhinchina-ycpd3efd537-4126-4503-a3c2-04e121129e7d-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలు, చేసిన ఖర్చులు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని ప్రభుత్వం జగన్ పాలనలో తీసుకున్న పలు నిర్ణయాలు, చేసిన ఖర్చుల వివరాలను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. గత ప్రభుత్వం అధికార దుర్వినియోగం తీవ్రస్థాయిలో కొనసాగిందని ఆరోపించింది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు విషయాలు ప్రకటించిన ప్రభుత్వం.ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రjaganmohanreddy{#}Janasena;Tadepalli;CBN;Pawan Kalyan;Assembly;Andhra Pradesh;YCP;Egg;Telugu Desam Party;Jagan;TDP;Government;Telangana Chief Minister;CM;media;Newsఏపీ: జాతీయ మీడియాపై ఘాటుగా స్పందించిన వైసీపీ..?ఏపీ: జాతీయ మీడియాపై ఘాటుగా స్పందించిన వైసీపీ..?jaganmohanreddy{#}Janasena;Tadepalli;CBN;Pawan Kalyan;Assembly;Andhra Pradesh;YCP;Egg;Telugu Desam Party;Jagan;TDP;Government;Telangana Chief Minister;CM;media;NewsWed, 21 Aug 2024 21:48:57 GMTఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలు, చేసిన ఖర్చులు ప్రస్తుతం ఏపీ  రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని ప్రభుత్వం జగన్ పాలనలో తీసుకున్న పలు నిర్ణయాలు, చేసిన ఖర్చుల వివరాలను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. గత ప్రభుత్వం అధికార దుర్వినియోగం తీవ్రస్థాయిలో కొనసాగిందని ఆరోపించింది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు విషయాలు ప్రకటించిన ప్రభుత్వం.ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ట్రోలింగ్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ప్రారంభమైన ఈ ట్రోలింగ్ ప్రస్తుత ఎగ్ పఫ్ ల కోసం కోట్లు ఖర్చుచేసారన్న ప్రచారంతో మరింత ఊపందుకుంది. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన పార్టీల సోషల్ మీడియా అకౌంట్స్, టిడిపి ఫాలోవర్స్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, జనసైనికులు... మొత్తంగా జగన్ ను వ్యతిరేకించేవారు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు.వైసిపి అధికారంలో వున్న ఐదేళ్లు తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసమే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ గా కొనసాగింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఇక్కడినుండి పాలనావ్యవహారాలు చూసుకున్నారు. ఆయన కుటుంబం కూడా ఇదే తాడేపల్లి నివాసంలో వుండేవారు.అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో పాటు సీఎంవో ఉద్యోగులు, సిబ్బంది, ఇంట్లో పనిచేసేవారు, సెక్యూరిటీ... ఇలా అందరూ కలిసి ఐదేళ్లలో 18 లక్షల ఎగ్ పఫ్స్ తిన్నారన్నది టిడిపి ఆరోపణ. అంటే తాడేపల్లి నివాసం ఎగ్ పఫ్స్ ఖర్చే రూ.3.62 కోట్లట. ఇలా ఎగ్ పఫ్స్ పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వాడుకున్నారని మండిపడుతున్నారు.

ఐదేళ్ళలో ఎగ్ పఫ్స్ కోసం రూ.3.62 కోట్లు ఖర్చు చేసారంటే ఏడాదికి ఈ ఖర్చు రూ.72 లక్షలు... నెలకు దాదాపు రూ.6 లక్షలు... రోజుకు దాదాపు రూ.20 వేలు. ఈ లెక్కలను బట్టి ఐదేళ్లలో తాడేపల్లి నివాసానికి 18 లక్షల ఎగ్ పఫ్స్ వెళ్లాయి... అంటే రోజుకు 993 ఎగ్ పఫ్స్ తిన్నారన్నమాట. ఇలా కేవలం తాడేపల్లిలో ఎగ్ పఫ్స్ కోసమే జగన్ సర్కార్ ఇంత ఖర్చు చేసారా..! అంటూ ఆశ్చర్యపోతున్నారు.వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుండి  పరిపాలనా వ్యవహారాలు చూసుకున్నారా లేక ఎగ్ పఫ్స్ తినడమే పనిగా పెట్టుకున్నారా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ఎగ్ పఫ్ తింటున్న ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఎగ్ పఫ్ సీఎం అంటూ జగన్ ను పేర్కొంటూ టిడిపి అనుకూల సోషల్ మీడియాల్లో పోస్టులు వెలుస్తున్నాయి. ఈ వార్తను తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి.అధికారం కోల్పోతే ఇలాంటి వార్తలు చాలా వినాల్సి వస్తుంది. గతంలో 2019లో వై ఎస్ జగన్ అధికారం చేపట్టాక చంద్రబాబు తన నివాసంలో ఎలుకలు పట్టడానికి భారీ మొత్తంలో ఖర్చు చేసారని తీవ్రస్థాయిలో అసెంబ్లీలో విమర్శలు చేసారు. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది, వైసీపీ ని టార్గెట్ చేస్తూ ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. అధికారం వచ్చాక జగన్ సీఎం కార్యాలయం ఫుర్నిచర్ ను కూడా తన ఇంటి కోసం వాడుకున్నారని టీడీపీ లీడర్లు అన్నసంగతి తెలిసిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>