PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagananna-goru-mudda8e35fc85-512f-4e80-bcab-20bb0764bfcc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagananna-goru-mudda8e35fc85-512f-4e80-bcab-20bb0764bfcc-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో.. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు అధికారంలో ఉండి అమరావతిని ప్రకటిస్తే.. జగన్ వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ రచ్చ చేశారు. ఇంకా ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత... జగన్ చేపట్టిన పథకాల పేర్లను మార్చుతూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన చాలా పథకాల పేర్లను... చంద్రబాబు కూటమి సర్కారు మార్చేసింది. jagananna goru mudda{#}kalyan;Telugu Desam Party;School;2020;Reddy;Raccha;CBN;Jagan;Andhra Pradesh;March;Government"డొక్కా సీతమ్మ" కోసం జగనన్న గోరుముద్దకు ఎసరు పెట్టిన పవన్‌ ?"డొక్కా సీతమ్మ" కోసం జగనన్న గోరుముద్దకు ఎసరు పెట్టిన పవన్‌ ?jagananna goru mudda{#}kalyan;Telugu Desam Party;School;2020;Reddy;Raccha;CBN;Jagan;Andhra Pradesh;March;GovernmentWed, 21 Aug 2024 08:16:48 GMT*  2020లో జగనన్న గోరుముద్ద ప్రారంభం
* పిల్లలకు పౌష్టికాహారం అందించడం లక్ష్యంగా  ఈ పథకం ప్రారంభం
* డొక్కా సీతమ్మ మధ్యాహ్న ఒడి భోజనo  



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో.. కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు అధికారంలో ఉండి అమరావతిని ప్రకటిస్తే..  జగన్ వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ  రచ్చ చేశారు. ఇంకా ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత... జగన్ చేపట్టిన పథకాల పేర్లను మార్చుతూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన చాలా పథకాల పేర్లను... చంద్రబాబు కూటమి సర్కారు మార్చేసింది.


అందులో జగనన్న గోరుముద్ద ఒకటి. వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు... అనేక సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. అయితే ఆ పథకాలకు జగన్ అనే పేరు వచ్చేలా ఆయన పెట్టుకున్నారు.  ఇదే అంశం తెలుగుదేశం నేతలకు నచ్చడం లేదు. అందుకే లేటెస్ట్గా జగనన్న గోరుముద్ద పథకానికి.. పేరు మార్చేశారు.

పేద విద్యార్థుల కోసం.. జగనన్న బోరు ముద్ద పథకం తీసుకువచ్చారు. అయితే ఈ పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న ఒడి భోజనo  అని పేరు మార్చి అమలు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. 2020 సంవత్సరంలో ఈ స్కీమ్ ను జగన్ ప్రారంభించగా... దీనికి పేరు మార్చి టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. రోజుకో మెనూతో... స్కూల్ విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడమే ఈ స్కీం ముఖ్య ఉద్దేశం.

పేరు ఏదైనా... ఏపీలోని విద్యార్థులకు మాత్రం పౌష్టిక ఆహ్వానం అందించడమే లక్ష్యంగా...  చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. అటు.. ప్రతి పథకానికి జగన్ అనే పేరు వాడటం కంటే.. ఇతర పేర్లు వాడుంటే బెటర్ అని కూడా జగన్ మోహన్ కి సూచిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అయితే.. అన్న క్యాంటీన్లకు డొక్కా సీతమ్మ పేరు పెట్టాలని పవన్‌ కళ్యాణ్ భావించారు. కానీ చంద్రబాబు అలా చేయలేదు. జగనన్న గోరుముద్దకు డొక్కా సీతమ్మ పేరు పెట్టి... పవన్‌ కళ్యాణ్‌ ను కూల్‌ చేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>