MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantah-bussiness-world-pickle-ball-leageac734695-788c-44c0-b4a0-94d0b1000001-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantah-bussiness-world-pickle-ball-leageac734695-788c-44c0-b4a0-94d0b1000001-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిన్న అనగా ఆగస్టు 20వ తేదీన.." వెయిట్ చేయండి.. త్వరలోనే స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాను" అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఇది ఎంతలా వైరల్ అయింది అంటే దీనిపై రకరకాల రూమర్స్ కూడా వినిపించాయి. ముఖ్యంగా తన మాజీ భర్త నాగచైతన్య శోభితను నిశ్చితార్థం చేసుకోవడంతో ఈమె కూడా ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది అంటూ వార్తలు వినిపించాయి..అందులో భాగంగానే బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కపూర్ తో ప్రేమలో ఉందనే వార్తలు వినిపించగా.. ఇప్పుడు ఇతడితో నిశ్చితార్థం జరుపుకొని సడన్ సర్ప్రైజ్ ఇస్తుందా అంటూsamantah;bussiness;world pickle ball leage{#}Raj Kapoor;Samantha;GEUM;bollywood;media;Chennai;Husband;Instagram;Heroine;Newsఓహో.. సమంత సర్ ప్రైజ్ ఇదేనా..?ఓహో.. సమంత సర్ ప్రైజ్ ఇదేనా..?samantah;bussiness;world pickle ball leage{#}Raj Kapoor;Samantha;GEUM;bollywood;media;Chennai;Husband;Instagram;Heroine;NewsWed, 21 Aug 2024 07:36:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిన్న అనగా ఆగస్టు 20వ తేదీన.." వెయిట్ చేయండి.. త్వరలోనే స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాను" అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఇది ఎంతలా వైరల్ అయింది అంటే దీనిపై రకరకాల రూమర్స్ కూడా వినిపించాయి. ముఖ్యంగా తన మాజీ భర్త నాగచైతన్య శోభితను నిశ్చితార్థం చేసుకోవడంతో ఈమె కూడా ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది అంటూ వార్తలు వినిపించాయి..అందులో భాగంగానే బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కపూర్ తో ప్రేమలో ఉందనే వార్తలు వినిపించగా.. ఇప్పుడు ఇతడితో నిశ్చితార్థం జరుపుకొని సడన్ సర్ప్రైజ్ ఇస్తుందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాదు రకరకాల కామెంట్లు చేశారు.

ఇలా నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధమైన కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది సమంత. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సమంత వరల్డ్ పికిల్ బాల్ లీగ్  లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు తెలిపింది.. చెన్నై టీం కి ఓనర్ గా ఉండడం చాలా సంతోషంగా ఉందని చెబుతూ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది న్యూ బిగినింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా జోడించింది ఈ ముద్దుగుమ్మ. దీంతో సమంత పెట్టిన పోస్ట్  నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసి నెటిజన్స్..  ఓహో సమంత పెట్టిన పోస్ట్ కు అర్థం ఇదా అంటూ కామెంట్ చేస్తున్నారు .

ఇక మరి కొంతమంది ఆల్ ద బెస్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బ్యాట్మింటన్ లాగానే ఉంటుంది ఈ పికిల్ బాల్ గేమ్ కూడా.. ఇకపోతే ఇంతకుముందు కూడా సమంతకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అందులో సమంత డెనిమ్ జీన్స్ , పోలో టీ షర్ట్ వేసుకొని కనిపించింది.  బ్లాక్ కలర్ స్పెక్స్ ధరించి చాలా క్యూట్గా ఆకట్టుకుంది. ఆమె టీ షర్టుపై లోగో ఉన్నా  అంత క్లియర్ గా అర్థం కాలేదు. చేతిలో పికిల్ బాల్ మాత్రమే ఉంది దానితో ఆడుకుంటూ నడుస్తూ కనిపించింది ఈ ముద్దుగుమ్మ.  అప్పుడు దానికి సంబంధించి క్లారిటీ రాలేదు కానీ ఇప్పుడు సమంత పోస్టుతో అర్థమయింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>