PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rythu-bharosa-annadata-sukhibhava-jagan-chandra-babu-ap7f74e045-7aab-4c6d-9de2-2fcd071315c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rythu-bharosa-annadata-sukhibhava-jagan-chandra-babu-ap7f74e045-7aab-4c6d-9de2-2fcd071315c6-415x250-IndiaHerald.jpg •రైతు భరోసా కాదు అన్నదాత సుఖీభవగా పేరు మార్పు.. •రూ.7,500 బదులు రూ.14,000 •పథకం అమలయ్యేది ఎప్పుడో.. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది..వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా రైతు భరోసా కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6 వేల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం మరో 7,500 రూపాయలను జమ చేసి, మొత్తంగా 13,500 రూపాయలను ఈ రైతు భరోసా పథకం కింద అందించారు. అయితే 2024లో అనూహ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందులో భాగంగానే సూపర్ సిక్స్ పథకాలను టిడిపి ప్రభుత్వం అమలులోRYTHU BHAROSA;ANNADATA SUKHIBHAVA;JAGAN;CHANDRA BABU;AP{#}central government;March;Jagan;YCP;TDP;Governmentరైతు భరోసా నుండి అన్నదాత సుఖీభవ.. పేరు మార్చినా పథకం ఒకటే..!రైతు భరోసా నుండి అన్నదాత సుఖీభవ.. పేరు మార్చినా పథకం ఒకటే..!RYTHU BHAROSA;ANNADATA SUKHIBHAVA;JAGAN;CHANDRA BABU;AP{#}central government;March;Jagan;YCP;TDP;GovernmentWed, 21 Aug 2024 10:15:00 GMT

•రైతు భరోసా కాదు అన్నదాత సుఖీభవగా పేరు మార్పు..

•రూ.7,500 బదులు రూ.14,000

•పథకం అమలయ్యేది ఎప్పుడో..


2019 ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది..వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా రైతు భరోసా కూడా ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6 వేల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం మరో 7,500 రూపాయలను జమ చేసి, మొత్తంగా 13,500 రూపాయలను ఈ రైతు భరోసా పథకం కింద అందించారు. అయితే 2024లో అనూహ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందులో భాగంగానే సూపర్ సిక్స్ పథకాలను టిడిపి ప్రభుత్వం అమలులోకి తీసుకురావడానికి దృష్టి పెట్టిన విషయం తెలిసిందే.  ముఖ్యంగా టిడిపి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలలో మెగా డీఎస్సీ, పింఛన్లు, ఉచిత ఇసుక వంటి హామీలను ఇప్పటికే అమలు చేశారు.
 త్వరలోనే రైతులకు సంబంధించిన పథకాన్ని అన్నదాత సుఖీభవ పేరుతో అందివ్వనున్నారు.

జగన్ ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకానికి ధీటుగా పథకం పేరు మార్చి అన్నదాత సుఖీభవ అన్న పేరుతో ప్రతి ఏటా రైతుల ఖాతాలో 20వేల రూపాయలను జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.. ఇప్పటికే రైతు భరోసా పేరుతో ఉన్న పోర్టల్ ను టిడిపి కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవగా మార్చి త్వరలోనే విధివిధానాలను కూడా ఖరారు చేయనున్నట్లు తెలిపింది. ఇకపోతే అన్నదాత సుఖీభవ పథకం కింద కేంద్రం ఇచ్చే రూ .6వేలకు మరో రూ.14 వేలు కలిపి మొత్తం రూ.20,000 ఇవ్వనున్నట్లు తెలిపింది.


ఈ పథకం గనుక అమలులోకి వస్తే రైతులకు ఇబ్బందులు ఉండవని చెప్పవచ్చు. ముఖ్యంగా పెట్టుబడి సహాయంగా ఈ డబ్బు కాస్త అయినా ఊరటను కలిగిస్తుంది. ఇకపోతే కుటుంబంలో ఒకరికే ఈ పథకం కింద లబ్ధి పొందేలా నిబంధనలు ఉండనున్నట్లు సమాచారం. జూలై నెలలోనే కేంద్రం,  రాష్ట్రాలు బడ్జెట్ ప్రవేశపెట్టాయి. ఈ నేపథ్యంలోనే బడ్జెట్తో పాటు ఈ పథకానికి కూడా కేటాయింపులు జరిపారు. ఇక త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>