Healthpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/weight-loss736e7177-2b4c-4007-b28a-2dea048dd670-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/weight-loss736e7177-2b4c-4007-b28a-2dea048dd670-415x250-IndiaHerald.jpgబరువు తగ్గాలంటే ఉదయం ఒక్క డ్రింక్ తాగితే సరిపోదు. రాత్రి పడుకోవడానికి ముందు కొన్ని రకాల పానీయాలు తాగితే త్వరగా బరువు తగ్గవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చాలామంది ఓవర్ వెయిట్ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. బరువు తగ్గడానికి జిమ్‌కు వెళ్లి కష్టపడుతున్నారు. లేదా ఆపరేషన్ చేయించుకోవడం సిద్ధమవుతున్నారు కానీ ఇవన్నీ అవసరం లేదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు. రాత్రి పడుకోవడానికి ముందు కొన్ని పానీయాలు తాగితే శరీరంలోని కొవ్వు అంతా కరిగిపోతుందని అంటున్నారు మరి ఆ హెల్తీ డ్రింక్స్ ఏవో తెలుసWEIGHT LOSS{#}Vitamin C;Green tea;Cholesterol;Manamపడుకునే ముందు ఈ డ్రింక్స్ తాగితే కొవ్వు అంతా కరిగిపోతుంది..?పడుకునే ముందు ఈ డ్రింక్స్ తాగితే కొవ్వు అంతా కరిగిపోతుంది..?WEIGHT LOSS{#}Vitamin C;Green tea;Cholesterol;ManamWed, 21 Aug 2024 20:00:00 GMTబరువు తగ్గాలంటే ఉదయం ఒక్క డ్రింక్ తాగితే సరిపోదు. రాత్రి పడుకోవడానికి ముందు కొన్ని రకాల పానీయాలు తాగితే త్వరగా బరువు తగ్గవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. చాలామంది ఓవర్ వెయిట్ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. బరువు తగ్గడానికి జిమ్‌కు వెళ్లి కష్టపడుతున్నారు. లేదా ఆపరేషన్ చేయించుకోవడం సిద్ధమవుతున్నారు కానీ ఇవన్నీ అవసరం లేదని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ పేర్కొంటున్నారు. రాత్రి పడుకోవడానికి ముందు కొన్ని పానీయాలు తాగితే శరీరంలోని కొవ్వు అంతా కరిగిపోతుందని అంటున్నారు మరి ఆ హెల్తీ డ్రింక్స్ ఏవో తెలుసుకుందాం.

గ్రీన్ టీ

గ్రీన్ టీ అనేది ఒక రకమైన టీ. ఇందులో ఆరోగ్యానికి మంచి అనేక పదార్థాలు ఉంటాయి. వీటిని యాంటీ ఆక్సిడెంట్స్, కేటెచిన్స్ అని అంటారు. ఈ పదార్థాలు మన శరీరంలోని కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయపడతాయి. గ్రీన్ టీ తాగడం వల్ల మన శరీరంలోని కొవ్వు కరిగే వేగం పెరుగుతుంది. రాత్రి పడుకోవడానికి ముందు గ్రీన్ టీ తాగితే నిద్ర బాగా పడుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల అర్ధరాత్రి వేళల్లో ఆకలి వేయదు.

సెలెరీ వాటర్

సెలెరీ వాటర్ లేదా అజ్వాన్ నీరు అనేది కూడా వెయిట్ తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. దీన్ని రాత్రిపూట తాగవచ్చు లేదంటే మార్నింగ్ కూడా తాగవచ్చు. దీన్ని నీళ్లలో నానబెట్టి ఎన్ని గంటల తర్వాత వడకట్టి తాగితే అజ్వాన్ నీరు రెడీ. ఈ నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంటే, మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది. దీంతో బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా, కడుపులో గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు ఉన్నవారికి ఇది చాలా మంచిది.

నిమ్మకాయ నీరు

ఒక నిమ్మకాయ జ్యూస్ వెచ్చటి నీటిలో కలిపి నిమ్మకాయ నీరు రెడీ. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది మన శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. దీంతో బరువు తగ్గడం సులభమవుతుంది. అంతేకాకుండా, శరీరానికి కావాల్సిన నీటిని అందిస్తుంది.

సెలరీ జ్యూస్

సెలరీ అనేది ఒక రకమైన కూరగాయ. దీన్ని జ్యూస్ చేస్తే సెలరీ జ్యూస్ అవుతుంది. ఈ జ్యూస్ చాలా తేలికైనది. ఇందులో నీరు ఎక్కువగా ఉంటుంది. రాత్రి పడుకోవడానికి ముందు ఈ జ్యూస్ తాగితే చాలా మంచిది. ఇది శరీరానికి కావాల్సిన నీటిని అందిస్తుంది. రాత్రి వేళ ఆకలి వేయకుండా నియంత్రిస్తుంది. శరీరంలోని చెత్త పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. నిరంతరం తాగితే బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>