PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-rajasekhar-reddybf83a351-9b2c-418e-bc27-b158dc8d907b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-rajasekhar-reddybf83a351-9b2c-418e-bc27-b158dc8d907b-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విమానాశ్రయాన్ని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అని కూడా పిలుస్తారనే సంగతి తెలిసిందే. మొదట ఈ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టినా వైఎస్సార్ హయాంలో ఈ ఎయిర్ పోర్ట్ పూర్తి కావడంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టారు. హైదరాబాద్‌కు సేవలందిస్తున్న ఏకైక పౌర విమానాశ్రయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కావడం గమనార్హం. ys rajasekhar reddy{#}Rajiv Gandhi;Y. S. Rajasekhara Reddy;Shamshabad;NTR;TDP;March;Government;INTERNATIONAL;Teluguశంషాబాద్ ఎయిర్ పోర్ట్ పేరు మార్చడమే వైఎస్సార్ చేసిన తప్పా.. అసలేం జరిగిందంటే?శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పేరు మార్చడమే వైఎస్సార్ చేసిన తప్పా.. అసలేం జరిగిందంటే?ys rajasekhar reddy{#}Rajiv Gandhi;Y. S. Rajasekhara Reddy;Shamshabad;NTR;TDP;March;Government;INTERNATIONAL;TeluguWed, 21 Aug 2024 09:26:00 GMTరెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విమానాశ్రయాన్ని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అని కూడా పిలుస్తారనే సంగతి తెలిసిందే. మొదట ఈ ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టినా వైఎస్సార్ హయాంలో ఈ ఎయిర్ పోర్ట్ పూర్తి కావడంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టారు. హైదరాబాద్‌కు సేవలందిస్తున్న ఏకైక పౌర విమానాశ్రయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కావడం గమనార్హం.
 
అయితే అప్పట్లో పేరు మార్చడం విషయంలో వైఎస్సార్ పై ఒకింత విమర్శలు వచ్చాయి. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పేరు మార్చడమే వైఎస్సార్ చేసిన తప్పని అభిప్రాయం వ్యక్తం చేసే వాళ్లు సైతం ఉన్నారు. ఈ విమానాశ్రయం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య నమూనాలో నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం కావడం గమనార్హం.
 
బేగంపేట విమానాశ్రయంలో, అంతర్జాతీయ టెర్మినల్‌కు రాజీవ్ గాంధీ పేరు పెట్టగా దేశీయ టెర్మినల్‌కు టిడిపి వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ పేరు పెట్టారు. కొత్త విమానాశ్రయంలో ఈ నామకరణ మహాసభను కొనసాగించాలని టీడీపీ భావించగా కొత్త విమానాశ్రయానికి ఒకే ఒక టెర్మినల్ ఉంది. 2008 సంవత్సరం మార్చి నెల 14వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రారంభం కాగా డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే డిమాండ్‌ను టీడీపీ రిపీట్ చేసింది.
 
అయితే టీడీపీ డిమాండ్ ను వైఎస్సార్ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటికీ ఈ విమానాశ్రయం రాజీవ్ గాంధీ పేరుతోనే కొనసాగుతోంది. దేశ విదేశాలకు ఈ విమానాశ్రయం ద్వారా ప్రయాణికులు ప్రయాణ సేవలను కొనసాగిస్తున్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఎయిర్ పోర్ట్ నుంచి సర్వీసుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>