PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-chandra-babu8d42f19b-2893-4aba-b7e1-30064c344edb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-chandra-babu8d42f19b-2893-4aba-b7e1-30064c344edb-415x250-IndiaHerald.jpgఎన్నిక‌ల స‌మ‌యంలో మహిళల కోసం చంద్రబాబు మూడు కీలక పథకాలను ప్రకటించారు. వాటిలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అత్యంత కీలకమైంది. ఎందుకంటే ఒంటరి మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఇతర మహిళలు కావచ్చు వీరు అందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తానని ఇచ్చిన హామీ పై వారంతా నమ్మకంగా ఉన్నారు. ఇదే అమ‌లుచేస్తే తమకు రోజుకి కనీసం వంద రూపాయలు వరకు సేవ్ చేసుకోగలుగుతామని వారు అంచనా వేస్తున్నారు. chandra babu{#}CBN;festivalచంద్ర‌బాబు మిస్స‌యిన క్ష‌ణాలు.. టీడీపీలో హాట్‌టాపిక్ ..!చంద్ర‌బాబు మిస్స‌యిన క్ష‌ణాలు.. టీడీపీలో హాట్‌టాపిక్ ..!chandra babu{#}CBN;festivalWed, 21 Aug 2024 13:22:29 GMTరాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలు చంద్రబాబుపై కొన్ని ఆశలు పెట్టుకున్నారు. ఇది ఎలా తెలుసు? అని చాలామందికి సందేహం అయితే రావచ్చు. కానీ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు, కామెంట్లు గమనిస్తే రాఖీ సందర్భంగా చంద్రబాబు తమకు ఇచ్చిన హామీల విషయంలో ఏదైనా ప్రకటన చేస్తారని మహిళలు ఎదురుచూసినట్టు స్పష్టమైనది. వీరిలో కొంతమంది ఉద్యోగినులు, ప్రభుత్వ, ప్రైవేటు వర్గాలు కూడా ఉన్నాయి. వారు సోషల్ మీడియాలో రాఖీ సందర్భంగా ఆర్టీసీ బస్సుల విషయంలో ఒక ప్రకటన చేయండి సార్ అని పోస్టు పెట్టడం బాగా వైరల్ అయింది.


ఎన్నిక‌ల స‌మ‌యంలో మహిళల కోసం చంద్రబాబు మూడు కీలక పథకాలను ప్రకటించారు. వాటిలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అత్యంత కీలకమైంది. ఎందుకంటే ఒంటరి మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఇతర మహిళలు కావచ్చు వీరు అందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తానని ఇచ్చిన హామీ పై వారంతా నమ్మకంగా ఉన్నారు. ఇదే అమ‌లుచేస్తే తమకు రోజుకి కనీసం వంద రూపాయలు వరకు సేవ్ చేసుకోగలుగుతామని వారు అంచనా వేస్తున్నారు.


ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లి రావాలన్నా కనీసం వెళ్లడానికి రావడానికి 60 నుంచి 70 రూపాయలు ఖర్చవుతుంది అని అనే మహిళల అంచనా. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ ప్రకటనను రాఖీ పండుగ సందర్భంగా చంద్రన్న తమకు కానుకగా ఇస్తారన్నది ఉద్యోగుల ప్రధాన కామెంట్. అయితే చంద్రబాబు ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం మహిళలకు రక్షణ కల్పిస్తామని, మహిళలకు అండగా ఉంటామని మహిళలు అభివృద్ధి చెందాలని మాత్రమే అని పేర్కొన్నారు.


ఇక రెండో విషయాన్ని తీసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఇది దీపం పథకం ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. కాబట్టి మిగతా వాళ్ళకి వర్తించకపోవచ్చు. అయినప్పటికీ మహిళాలకు సంబంధించిన ముఖ్యంగా అన్నాచెల్లెళ్లకు సంబంధించిన రాఖీ పౌర్ణమి రోజు ఈ పథకం అయినా చంద్రబాబు ఎప్పటి నుంచి అమలు చేస్తామనేది చెప్పి ఉంటే బాగుండేదని టిడిపిలోను ఒక వర్గం నాయకులు వ్యాఖ్యానించారు.


మరో పథకం ఆడబిడ్డ నిధి. ఇది వాస్త‌వానికి ఖర్చుతో కూడుకుంది. కాబట్టి దీన్ని ప్రకటించాలని మహిళలు ఆశించినా ప్రకటించలేని పరిస్థితి అయితే ఉంది. కాబట్టి దీనిపై పెద్దగా చర్చ అయితే జరగలేదు. ప్రధానంగా జరిగిన చర్చ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై చంద్రబాబు ఏదో ప్రకటన చేస్తారని ఒక డేట్ అయినా ఇస్తారని అందరూ చూశారు. కానీ రాఖీ పౌర్ణమి రోజు మాత్రం చంద్రబాబు కేవలం శుభాకాంక్షలు చెప్పి వదిలేయడం గమనార్హం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>