Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle77a3fb5b-2a7c-4d10-86ca-a0865562b146-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle77a3fb5b-2a7c-4d10-86ca-a0865562b146-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా రీసెంట్ టైమ్స్ లో తెలుగు నుంచి సూపర్ హిట్ అయిన సినిమా ఏదీ అంటే కల్కి అని మొహమాటం లేకుండా చెప్పేయచ్చు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా, ఇండియాలో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా, ఎన్నో విభాగాల్లో ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే అందరూ మెచ్చుకున్న ఈ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కాడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సిప్రభాస్‌ను బాలీవుడ్ నటుడు అర్షద్ జోకర్ అని సంబోధించడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కల్కి సినిమాను ఇంకా బాగా తీసి ఉండొచ్చని, ఇది కచ్socialstars lifestyle{#}ajay;Joker;sudheer babu;vijay kumar naidu;Indian;Prabhas;bollywood;Telugu;Tollywood;Cinemaఅజయ్ భూపతి : ప్రభాస్ అంటే వారికి అసూయ.. అందుకే ఆ వ్యాఖ్యలు..!!అజయ్ భూపతి : ప్రభాస్ అంటే వారికి అసూయ.. అందుకే ఆ వ్యాఖ్యలు..!!socialstars lifestyle{#}ajay;Joker;sudheer babu;vijay kumar naidu;Indian;Prabhas;bollywood;Telugu;Tollywood;CinemaWed, 21 Aug 2024 13:40:13 GMTప్రపంచవ్యాప్తంగా రీసెంట్ టైమ్స్ లో తెలుగు నుంచి సూపర్ హిట్ అయిన  సినిమా ఏదీ అంటే కల్కి అని మొహమాటం లేకుండా చెప్పేయచ్చు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా, ఇండియాలో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా, ఎన్నో విభాగాల్లో ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే అందరూ మెచ్చుకున్న  ఈ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కాడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సిప్రభాస్‌ను బాలీవుడ్ నటుడు అర్షద్ జోకర్ అని సంబోధించడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కల్కి సినిమాను ఇంకా బాగా తీసి ఉండొచ్చని, ఇది కచ్చితంగా హీరో, దర్శకుడి ఫెయిల్యూర్ అని అన్నాడు. కల్కిలో ప్రభాస్‌ను చూస్తే జోకర్‌లా అనిపించాడంటూ అర్షద్ చేసిన వ్యాఖ్యల మీద అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ వంటి గోల్డెన్ వ్యక్తిని ఇలా అనడం సరికాదని సోషల్ మీడియాలో అందరూ కామెంట్లు పెడుతున్నారు.అయితే ప్రభాస్ అంటే అందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తి అని.. ఆయన ఎప్పుడూ ఎవరి గురించి ఏ విధంగానూ నెగెటివ్‌గా మాట్లాడరని, ఎవరైనా నెగెటివ్ మాట్లాడినా పట్టించుకోడని, అలాంటి మంచి వ్యక్తి మీద ఇలాంటి కామెంట్లు చేయడం తగదని అంతా అంటున్నారు. ఇక టాలీవుడ్ నుంచి కొంత మంది సెలెబ్రిటీలు ఈ వ్యాఖ్యల మీద మండి పడుతున్నారు. ప్రభాస్ వీటన్నంటికీ అతీతుడు అంటూ సుధీర్ బాబు స్పందించాడు.ఇక తాజాగా అజయ్ భూపతి చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రభాస్‌ను జోకర్ అంటూ చేసిన కామెంట్ మీద అజయ్ భూపతి మండి పడ్డాడు. సినిమా కోసం ప్రాణం పెట్టే నటుడు ప్రభాస్.. ఇండియన్ సినిమాను ఒక మెట్టు పైకి ఎక్కించాలని ప్రయత్నిస్తుంటాడు.. ఆయన మీద, ఆయన సినిమాల పట్ల మీకున్న జెలసీ మీ కంట్లోనే నాకు కనిపిస్తోంది.. ప్రతీ దానికి ఓ లిమిట్ ఉంటుంది.. మీ మీ అభిప్రాయాాల్ని చెప్పడానికి ఓ పద్దతి పాడు ఉంటాయ్ అన్నట్టుగా అజయ్ భూపతి కౌంటర్ వేశాడు. మీరు ఫేడ్ అవుట్ అయ్యారనే బాధ కూడా కనిపిస్తోందని సెటైర్ వేశాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>