PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth3bb9646c-85f8-46eb-b8ee-b1411d59a43c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth3bb9646c-85f8-46eb-b8ee-b1411d59a43c-415x250-IndiaHerald.jpg సెక్రటేరియట్లో భార‌త మాజీ ప్ర‌ధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపై కేటీఆర్ చేస్తున్న రాజకీయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. మాటల దాడి మాత్రమే కాదు ... చేతల దాడి కూడా చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సెక్రటేరియట్ లో పెట్టబోతున్నామని డిసెంబర్ 9వ తేదీన తాము ఆవిష్కరించబోతున్నామని ప్రకటించారు. వెంటనే సెక్రటేరియట్ లో ఎక్కడ తె ? లంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలో కూడా రేవంత్ స్థల పరిశీలన చేశారు. revanth{#}KTR;Revanth Reddy;Telanganaకేటీఆర్ విగ్ర‌హ రాజ‌కీయాల‌కు రేవంత్ మార్క్ కౌంట‌ర్.. అద్దిరిపోలే..?కేటీఆర్ విగ్ర‌హ రాజ‌కీయాల‌కు రేవంత్ మార్క్ కౌంట‌ర్.. అద్దిరిపోలే..?revanth{#}KTR;Revanth Reddy;TelanganaWed, 21 Aug 2024 12:20:45 GMT- రాజీవ్ విగ్ర‌హం సెక్ర‌టేరియ‌ట్ నుంచి తీసేస్తామ‌న్న కేటీఆర్‌
- తెలంగాణ త‌ల్లి విగ్ర‌హ ఏర్పాటు ప్ర‌క‌ట‌న‌తో కేటీఆర్‌కు రేవంత్ కౌంట‌ర్‌
- కేటీఆర్ ... రేవంత్ స‌వాళ్లు .. ప్ర‌తి స‌వాళ్ల‌తో వేడెక్కుతోన్న రాజ‌కీయం

- ( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) .

తెలంగాణలో రాజకీయాలు ఇప్పుడు ముదురుతున్నాయి. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ మధ్య విమర్శలు .. ప్రతి విమర్శలతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతుంది. సెక్రటేరియట్లో భార‌త మాజీ ప్ర‌ధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపై కేటీఆర్ చేస్తున్న రాజకీయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. మాటల దాడి మాత్రమే కాదు ... చేతల దాడి కూడా చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సెక్రటేరియట్ లో పెట్టబోతున్నామని డిసెంబర్ 9వ తేదీన తాము ఆవిష్కరించబోతున్నామని ప్రకటించారు. వెంటనే సెక్రటేరియట్ లో ఎక్కడ తె ? లంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలో కూడా రేవంత్ స్థల పరిశీలన చేశారు.


కెసిఆర్ సెక్రటేరియట్ ను నిర్మించిన తర్వాత ప్రారంభోత్సవం చేశారు.. కానీ ఎవరి విగ్రహాన్ని కూడా పెట్టలేదు. అసలు ఆ ప్లాన్ ఉందో లేదో కూడా తెలియదు .అయితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలనుకున్నామ‌ని బిఆర్ఎస్ నేతలు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అయితే రేవంత్ రాజీవ్ గాంధీ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. త్వరలో ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. అలాంటి సమయంలో కేటీఆర్ తాము రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామని ప్రకటనలు చేయడం ప్రారంభించారు.


అయితే తెలంగాణ తల్లి విగ్రహం లేకుండా రాజీవ్ గాంధీ మాత్రమే ఉంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావనకు రావడంతో వెంటనే రేవంత్ రెడ్డి అదిరిపోయే వ్యూహం మార్చారు. పట్టుదలకు పోకుండా వెంటనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి సన్నాహాలు మొదలుపెట్టేశారు. ఇలా ?కేటీఆర్ వేసిన ఎత్తు రేవంత్ ముందు చిత్తు అయిందని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>