MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/b-gopal174c8514-c308-4132-90bf-3286aeb255e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/b-gopal174c8514-c308-4132-90bf-3286aeb255e7-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి , బి గోపాల్ కాంబినేషన్ లో కొన్ని సంవత్సరాల క్రితం ఇంద్ర అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే చిరంజీవి కి జోడిగా నటించగా ... మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించాడు. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి ఆ సమయంలో టాలీవుడ్ ఆల్ తిమి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఆ సమయంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమాను ఈb gopal{#}vyjayanthi;Music;mani sharma;Industry;Tollywood;Interview;aarti agarwal;aswini;sonali bendre;indra;b gopal;Cinema;Chiranjeeviచిరంజీవికి అవసరం లేదు.. అయిన ఇంద్ర లోని ఆ సాంగ్ కోసం అన్ని గంటలు కష్టపడ్డాడు.. బి గోపాల్..!చిరంజీవికి అవసరం లేదు.. అయిన ఇంద్ర లోని ఆ సాంగ్ కోసం అన్ని గంటలు కష్టపడ్డాడు.. బి గోపాల్..!b gopal{#}vyjayanthi;Music;mani sharma;Industry;Tollywood;Interview;aarti agarwal;aswini;sonali bendre;indra;b gopal;Cinema;ChiranjeeviWed, 21 Aug 2024 18:09:00 GMTమెగాస్టార్ చిరంజీవి , బి గోపాల్ కాంబినేషన్ లో కొన్ని సంవత్సరాల క్రితం ఇంద్ర అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే చిరంజీవి కి జోడిగా నటించగా ... మణిశర్మమూవీ కి సంగీతం అందించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించాడు. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి ఆ సమయంలో టాలీవుడ్ ఆల్ తిమి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఆ సమయంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమాను ఈ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 22 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రీ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ మూవీ రీ రిలీజ్ టికెట్ బుకింగ్ లకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది.

ఇకపోతే ఈ సినిమా తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ దర్శకుడు అయినటువంటి బి గోపాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను ఆయన తెలియజేశారు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా బి గోపాల్ మాట్లాడుతూ ... చిరంజీవి గారు ఇంద్ర సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఆయన గొప్ప డాన్సర్ అయినప్పటికీ ఈ సినిమాలలోని పాటల కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ మూవీ లో దాయి దాయి అనే సాంగ్ కోసం ఆయన 5 గంటల పాటు కష్ట పడి ప్రాక్టీస్ చేసి మరి స్టెప్పులు వేశాడు. ఆయన ఒక గొప్ప డాన్సర్. అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా స్టెప్పులు వేయగలరు. కానీ ఖచ్చితంగా స్టెప్ బాగా రావాలి అని ఆయన ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేసి మరి డాన్స్ చేశాడు అని బి గోపాల్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>