MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-1fd05250-0ee3-4637-9752-e6ed433d9537-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-1fd05250-0ee3-4637-9752-e6ed433d9537-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ చాలా పొదుపు మనిషి. బాగా అవసరంలో ఉన్న ప్రజలకు మాత్రమే ఆయన సహాయం చేయడానికి ముందుకు వస్తారు. లేదంటే ఆయన జేబులో నుంచి పైసా కూడా రాలదు అని అంటారు. ఈ విషయం మరోసారి ప్రూవ్ అయింది. బాలయ్య బాబు తన సిస్టర్స్‌తో కలిసి ఇటీవల రక్షా బంధన్‌ పండుగను చాలా ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నందమూరి అందగాడికి లోకేశ్వరి, పురందేశ్వరి, భువనేశ్వరి రాఖీలు కట్టి ఆశీర్వదించారు. అంతేకాదు ఈ సందర్భంగా బాలయ్యను సరదాగా ఆట పట్టించారు కూడా. బాలకృష్ణ కూడా అన్ని మర్చిపోయి చిన్నపిల్లోడి లాగా అల్లరి చేశాడు. Balayya {#}bhuvaneshwari;Daggubati Purandeswari;Nara Bhuvaneshwari;Prize;Allari;Cancer;Gift;Balakrishnaబిచ్చగాడికి కేవలం 10 పైసలే వేసిన బాలయ్య.. ఆమె ఆటపట్టించారుగా?బిచ్చగాడికి కేవలం 10 పైసలే వేసిన బాలయ్య.. ఆమె ఆటపట్టించారుగా?Balayya {#}bhuvaneshwari;Daggubati Purandeswari;Nara Bhuvaneshwari;Prize;Allari;Cancer;Gift;BalakrishnaWed, 21 Aug 2024 17:30:00 GMTనందమూరి బాలకృష్ణ చాలా పొదుపు మనిషి. బాగా అవసరంలో ఉన్న ప్రజలకు మాత్రమే ఆయన సహాయం చేయడానికి ముందుకు వస్తారు. లేదంటే ఆయన జేబులో నుంచి పైసా కూడా రాలదు అని అంటారు. ఈ విషయం మరోసారి ప్రూవ్ అయింది. బాలయ్య బాబు తన సిస్టర్స్‌తో కలిసి ఇటీవల రక్షా బంధన్‌ పండుగను చాలా ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నందమూరి అందగాడికి లోకేశ్వరి, పురందేశ్వరి, భువనేశ్వరి రాఖీలు కట్టి ఆశీర్వదించారు. అంతేకాదు ఈ సందర్భంగా బాలయ్యను సరదాగా ఆట పట్టించారు కూడా. బాలకృష్ణ కూడా అన్ని మర్చిపోయి చిన్నపిల్లోడి లాగా అల్లరి చేశాడు.

బాలకృష్ణ తన అక్కచెల్లెమ్మలను టీజ్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది. ఈ వీడియోలో అక్క పురందేశ్వరి బాలయ్య చిన్నతనంలో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గురించి తెలిపారు. సాధారణంగా రాఖీ కట్టిన సోదరికి బ్రదర్ అనేవాడు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి. తద్వారా ఆమెపై ప్రేమను చాటుకోవాలి. ఎంతమంది సిస్టర్స్ అంతమంది సిస్టర్స్ కి కూడా గిఫ్ట్స్ ఇవ్వాల్సిందే.

తమ స్తోమతకు తగినంత గిఫ్ట్స్ ఇస్తే సరిపోతుంది. అయితే బాలయ్య బాబు మాత్రం ఇక్కడ కూడా తన పొదుపుతనాన్ని చూపించారు. వైరల్ వీడియోలో బాలయ్య చేసిన ఈ అల్లరి రికార్డు అయింది. ఇందులో ఆయన ముందుగా తనకి రాఖీ కట్టిన అక్క లోకేశ్వరికి బహుమతిగా కొంత డబ్బులు ఇచ్చారు. తర్వాత బాలయ్యకు పురందేశ్వరి, భువనేశ్వరిలు రాఖీ కట్టారు. వారికి మాత్రం ఇతను కొత్తగా ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు. అక్క లోకేశ్వరికి ఇచ్చిన డబ్బునే మళ్లీ తీసుకొని ఇదిగో మీ గిఫ్ట్ అంటూ వాళ్లకి ఇస్తూ తెలివి ప్రదర్శించాడు.

పురందేశ్వరి బాలకృష్ణ పొదుపుతనాన్ని చూసి ఓ రేంజ్‌లో టీజ్‌ చేశారు. "ఛీఛీ.. ఇదే పని వీడు చిన్నప్పుడు కూడా చేశాడు. ఒకసారి బిచ్చగాడికి కేవలం 10 పైసలు బిచ్చం వేశాడు. దాంతో అమ్మ షాక్ అయింది. మరీ 10 పైసలు ఏంట్రా అని కూడా అడిగింది. అప్పుడు కూడా బెగ్గర్ కు వేసిన 10 పైసలు తీసుకొని అతనికే ఇచ్చాడు." అంటూ పురందేశ్వరి బాలయ్య బాబును ఆట పట్టించారు. బాలయ్యతో అట్లుంటది మరి అనుకుంటూ అక్కడే ఉన్న చాలామంది ఘల్లున నవ్వారు. ఏది ఏమైనా బాలయ్య చాలా భిన్నమైన, మంచి మనసున్న మనిషి అని చెప్పుకోవాలి. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో ప్రాణాలను నిలబెట్టారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>