Healthpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthh67c0032a-55ff-448d-871d-0028e5db1c68-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthh67c0032a-55ff-448d-871d-0028e5db1c68-415x250-IndiaHerald.jpgదక్షిణ భారతదేశంలో చాలామంది ధనియాల పొడిని దాదాపు ప్రతి కూరలో వాడతారు! కానీ దీని వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలున్న వారికి ధనియాల పొడి చాలా మేలు చేస్తుంది. ఇది థైరాయిడ్ గ్రంథిని సరిగ్గా పని చేయడానికి సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ధనియాల నీరు తాగితే గ్రంథి సమస్యలు తగ్గుతాయి. ఈ సమస్యలు తరచుగా వాత, కఫ దోషాలకు సంబంధించిన హార్మోన్ల అసమతుల్యత నుంచి ఉత్పన్నమవుతాయి. HEALTHH{#}bhavana;Potassium;Vitamin;Coriander;Coriander Seeds;Dhaniya Powder;Cancerఉదయాన్నే లేచి ఈ గింజల నీళ్లు తాగితే ఆరోగ్యమే ఆరోగ్యం..ఉదయాన్నే లేచి ఈ గింజల నీళ్లు తాగితే ఆరోగ్యమే ఆరోగ్యం..HEALTHH{#}bhavana;Potassium;Vitamin;Coriander;Coriander Seeds;Dhaniya Powder;CancerWed, 21 Aug 2024 21:00:00 GMTదక్షిణ భారతదేశంలో చాలామంది ధనియాల పొడిని దాదాపు ప్రతి కూరలో వాడతారు! కానీ దీని వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలున్న వారికి ధనియాల పొడి చాలా మేలు చేస్తుంది. ఇది థైరాయిడ్ గ్రంథిని సరిగ్గా పని చేయడానికి సహాయపడుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ధనియాల నీరు తాగితే గ్రంథి సమస్యలు తగ్గుతాయి. ఈ సమస్యలు తరచుగా వాత, కఫ దోషాలకు సంబంధించిన హార్మోన్ల అసమతుల్యత నుంచి ఉత్పన్నమవుతాయి.

ధనియాల్లో ఐరన్, పొటాషియం లాంటి ముఖ్యమైన పోషకాలు చాలా ఎక్కువ. దీంతో పాటు, మన శరీరానికి కావాల్సిన ఫైబర్, విటమిన్ ఎ, సి, కె లాంటివి కూడా ఉన్నాయి. ఈ పొడి నీరు తాగితే, శరీరానికి ఈ పోషకాలు అన్నీ అందుతాయి. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలున్న వారికి ఇది చాలా మంచిది. ధనియాలు డైజెస్టివ్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ధనియాల గింజలను నీళ్ళలో నానబెట్టి తాగితే, కడుపులో గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యలు మటుమాయమవుతాయి. అంతేకాకుండా, మధుమేహం ఉన్నవారికి కూడా ధనియాలు చాలా మంచిది. ఎందుకంటే, ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఈ ధనియాల్లో ఉండే కొన్ని రకాల రసాయనాలు శరీరంలోని వాపును తగ్గిస్తాయి. అంటే, కీళ్ళ నొప్పులు, వాపులు లాంటి సమస్యలున్న వారికి ఈ వాటర్ తాగితే చాలా రిలీఫ్ కలుగుతుంది. అంతేకాకుండా, ఈ గింజలలోని యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని నాశనం చేసే కణాలను నిరోధిస్తాయి. దీని వల్ల క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

 ధనియాల్లో ఫైబర్ చాలా ఎక్కువ లభిస్తుంది కాబట్టి కడుపు నిండిన భావన కలుగుతుంది. అందువల్ల త్వరగా ఆకలి వేయదు దీని ఫలితంగా ఆహారం ఎక్కువగా తినలేము. అంటే వెయిట్ లాస్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వాటర్ చాలా మేలు చేస్తుంది. అంతేకాకుండా, ఆడవారికి కలిగే నెలసరి సమయంలో కడుపు నొప్పి, తిమ్మిరి లాంటి సమస్యలు ఉంటాయి కదా, అవి తగ్గడానికి కూడా ధనియాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ ధనియాల నీరుతో స్కిన్ హెల్త్ మెరుగుపడుతుంది. అలాగే ఒత్తిడి నుంచి రిలీఫ్ కలుగుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>