MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఎన్నికలలో ఏపార్టీ గెలుస్తుందో సినిమాలలో ఏసినిమా సూపర్ హిట్ అవుతుందో అంచనాలు కట్టడం అనుభవం ఉన్నవారికి కూడ అంతు చిక్కడం లేదు. ఈమధ్య కాలంలో బాలీవుడ్ లో విడుదల అవుతున్న అనేక సినిమాలు ఫెయిల్ అవుతూ ఉండటంతో లేటెస్ట్ గా విడుదలైన ‘స్త్రీ 2’ పై ఎవరు ఎటువంటి అంచనాలు పెట్టుకోలేదు. దీనికితోడు ఈసినిమాలో నటించిన శ్రద్ధా కపూర్ ఐరెన్ లెగ్ బ్యూటీగా పేరు తెచ్చుకోవడంతో ఈసినిమా పై అంచనాలు మరింత తగ్గిపోయాయి. అయితే ఈసినిమా ఎవరు ఊహించని ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆగష్టు 15 నుంచి వచ్చిన లాంగ్ వీకెండ్ ను క్యాష్ BOLLYWOOD{#}raghava lawrence;Shradda Kapoor;Remake;Indian;Audience;vikram;bollywood;Yevaru;Industry;August;sunday;News;Telugu200 కోట్ల దెయ్యానికి పెరిగిపోయిన డిమాండ్ !200 కోట్ల దెయ్యానికి పెరిగిపోయిన డిమాండ్ !BOLLYWOOD{#}raghava lawrence;Shradda Kapoor;Remake;Indian;Audience;vikram;bollywood;Yevaru;Industry;August;sunday;News;TeluguTue, 20 Aug 2024 09:00:00 GMTఎన్నికలలో ఏపార్టీ గెలుస్తుందో సినిమాలలో ఏసినిమా సూపర్ హిట్ అవుతుందో అంచనాలు కట్టడం అనుభవం ఉన్నవారికి కూడ అంతు చిక్కడం లేదు. ఈమధ్య కాలంలో బాలీవుడ్ లో విడుదల అవుతున్న అనేక సినిమాలు ఫెయిల్ అవుతూ ఉండటంతో లేటెస్ట్ గా విడుదలైన ‘స్త్రీ 2’ పై ఎవరు ఎటువంటి అంచనాలు పెట్టుకోలేదు.



దీనికితోడు ఈసినిమాలో నటించిన శ్రద్ధా కపూర్ ఐరెన్ లెగ్ బ్యూటీగా పేరు తెచ్చుకోవడంతో ఈసినిమా పై అంచనాలు మరింత తగ్గిపోయాయి. అయితే ఈసినిమా ఎవరు ఊహించని ఘన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఆగష్టు 15 నుంచి వచ్చిన లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుని కేవలం నాలుగు రోజులలో 200 కోట్లు కలెక్ట్ చేయడం ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది.



ఆగష్టు 15కు తెలుగు రాష్ట్రాలలో విడుదలైన ‘మిష్టర్ బచన్’ ‘డబల్ ఇస్మార్ట్’ ఘోరంగా ఫెయిల్ అవ్వడంతో పాటు విక్రమ్ ‘తంగలాన్’ సగటు ప్రేక్షకుడుకి రుచించక పోవడంతో సినిమాలు చూడాలి అనుకునే వారికి ‘స్త్రీ 2’ లోని దెయ్యం కామెడీని తెగ ఎంజాయ్ చేయడంతో మన తెలుగు రాష్ట్రాలలో కూడ ఈ మూవీకి చాల మంచి కలక్షన్స్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించి గడిచిన ఆదివారం కేవలం బుక్ మై షోలో 8 లక్షల టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్ లో అయ్యాయి అంటే ఈమూవీ పట్ల క్రేజ్ ఎలా ఉందో అర్థం అవుతుంది.  





ఆడపిల్లలను మాయం చేసే ఒక దెయ్యంని పట్టుకునే నలుగురు మగ వాళ్ళ గ్యాంగ్ చుట్టూ తిరిగే ఈమూవీ కధ అందరికీ నచ్చడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడ నచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈసినిమాను రీమేక్ చేయాలని అనేకమంది తెలుగు దర్శక నిర్మాతలు ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే అనేకసార్లు లారెన్స్ దెయ్యం సినిమాలను చూసి విసికిపోయిన తెలుగు ప్రేక్షకులు ఈసినిమాను రీమేక్ చేస్తే ఎంతవరకు చూస్తారు అన్నది వేచి చూడాలి..  









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>