MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baahubali-8a6f818c-84fd-44ab-948d-20ba4932f053-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baahubali-8a6f818c-84fd-44ab-948d-20ba4932f053-415x250-IndiaHerald.jpgస్టూడెంట్ నెం.1, ఛత్రపతి, విక్రమార్కుడు లాంటి రాజమౌళి అతిపెద్ద హిట్స్ సాధించాడు. వీటి తర్వాత ఆయన చేసిన బాహుబలి మూవీ వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇలాంటి సినిమాలో ఒక చిన్న పాత్ర దక్కినా తమ జీవితం ధన్యమైపోయి ఉండేదని చాలామంది అగ్ర హీరోయిన్లు, హీరోలు కామెంట్ చేశారు. ఈ మూవీలో తప్పకుండా చేసి ఉండే వాళ్ళమని కూడా అన్నారు కానీ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఈ సినిమాలోని ముఖ్యమైన పాత్ర తన వద్దకు వచ్చినప్పుడు దాన్ని రిజెక్ట్ చేసింది ఆ పాత్ర మరేదో కాదు రామకృష్ణ పోషించిన శివగామి దేవి. బాహుబలి వన్ టు రెBaahubali {#}Sridevi Kapoor;ramakrishna;Rajamouli;Vikramarkudu;Prabhas;Bahubali;gold;producer;Producer;Blockbuster hit;bollywood;Heroine;Cinemaఆ కారణంతో బాహుబలి సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్..?ఆ కారణంతో బాహుబలి సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్..?Baahubali {#}Sridevi Kapoor;ramakrishna;Rajamouli;Vikramarkudu;Prabhas;Bahubali;gold;producer;Producer;Blockbuster hit;bollywood;Heroine;CinemaTue, 20 Aug 2024 19:00:00 GMT స్టూడెంట్ నెం.1, ఛత్రపతి, విక్రమార్కుడు లాంటి రాజమౌళి అతిపెద్ద హిట్స్ సాధించాడు. వీటి తర్వాత ఆయన చేసిన బాహుబలి మూవీ వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇలాంటి సినిమాలో ఒక చిన్న పాత్ర దక్కినా తమ జీవితం ధన్యమైపోయి ఉండేదని చాలామంది అగ్ర హీరోయిన్లు, హీరోలు కామెంట్ చేశారు. ఈ మూవీలో తప్పకుండా చేసి ఉండే వాళ్ళమని కూడా అన్నారు కానీ ఒక స్టార్ హీరోయిన్ మాత్రం ఈ సినిమాలోని ముఖ్యమైన పాత్ర తన వద్దకు వచ్చినప్పుడు దాన్ని రిజెక్ట్ చేసింది ఆ పాత్ర మరేదో కాదు రామకృష్ణ పోషించిన శివగామి దేవి. బాహుబలి వన్ టు రెండు పార్ట్స్ లో కూడా శివగామి దేవి పాత్ర చాలా హైలైట్ అవుతుంది.

ఈ క్యారెక్టర్ ముందుగా అలనాటి, దివంగత నటి శ్రీదేవి వద్దకు వచ్చింది. రాజమౌళి శ్రీదేవిని పిలిచి మరీ సినిమా స్టోరీ అంతా చెప్పి ప్రభాస్ తల్లి క్యారెక్టర్ చేయాలి అని అడిగారట. ఈ సినిమా తీసేనాటికే శ్రీదేవి హాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బాగా పాపులర్ అయింది ఆమెను తీసుకుంటే హిందీలో మూవీకి మంచి పాపులారిటీ వస్తుందని రాజమౌళి భావించారు అందుకే ఆమెకు మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ ని ఆఫర్ చేశాడు. కానీ శ్రీదేవి అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వలేదని చెబుతూ ఈ క్యారెక్టర్ ని సింపుల్ గా రిజెక్ట్ చేసిందట.

బాహుబలి సినిమాలో చేయడానికి శ్రీదేవి ఏకంగా రూ.8 కోట్లు ఇవ్వాలని అడిగిందట. అంతేకాదండోయ్ సినిమాలో షేర్ కూడా కావాలన్నదట. ఇవే కాకుండా తన  హోటల్ బిల్లులు, విమాన టికెట్ ఛార్జ్‌లు అన్నీ భరించాలని చెప్పిందట ఆ లెక్కన ఆమెకు ఒక్కదానికే రూ.15 కోట్లు ఇవ్వాల్సి వస్తుందని నిర్మాత భయపడ్డాడట. ఇదే విషయం రాజమౌళికి ప్రొడ్యూసర్ చెప్పాడట. దాంతో కంగుతున్న రాజమౌళి మళ్లీ ఆమెను కన్సల్ట్ కాకుండా ఆమె ప్లేస్ లో రమ్యకృష్ణను సెలెక్ట్ చేసుకున్నారని అంటారు.

 బాహుబలి సినిమాని చాలా బడ్జెట్ అద్భుతంగా తీశారు. విజువల్ వండర్ కావాలనే ఉద్దేశంతో మిగతా ఖర్చులన్నీ తగ్గించుకున్నారు. అలాంటి సమయంలో శ్రీదేవి వచ్చి 15 కోట్లు ఇవ్వాలని అనడంతో బడ్జెట్ కేటాయింపు ప్లాన్ చెడిపోతుందని ఆమెను వద్దనుకున్నారట. అయితే ఆమె డబ్బులు డిమాండ్ చేయడం నిజమో కాదో తెలియదు కానీ శ్రీదేవి పై చాలా విమర్శలు వచ్చాయి. బంగారం లాంటి అవకాశాన్ని శ్రీదేవి కాళ్ళదన్నుకుంది అని చాలామంది క్రిటిసైజ్‌ చేశారు. ఆ సమయంలో ఆమె పెదవి విప్పింది. తాను ఎప్పుడూ డబ్బులు డిమాండ్ చేయలేదని, నిర్మాత రాజమౌళికి అబద్ధం చెప్పి ఉంటాడని ఆమె ఒక వివరణ ఇచ్చుకుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>