Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/star-cricketer-b969a191-4997-48be-94dd-a8f12ac30cf0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/star-cricketer-b969a191-4997-48be-94dd-a8f12ac30cf0-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ త్వరలో రెండోసారి తండ్రి అవుతున్నారు. ఆయన భార్య బెక్కి బోస్టన్ సోషల్ మీడియాలో ఈ శుభవార్తను పంచుకున్నారు. తమ ఫ్యామిలీలో మరో చిన్న మెంబర్ చేరబోతున్నందున ఇంట్లో మరింత సందడిగా ఉండబోతుందని ఆమె తెలిపారు. 2020లో పాట్ కమ్మిన్స్, బెక్కి బోస్టన్ నిశ్చితార్థం చేసుకున్నారు. 2022, ఆగస్టులో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇప్పటికే ఆల్బీ అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఆల్బీ 2021 అక్టోబర్ 8న జన్మించాడు. తమ కుమారుడితో కలిసి తీసిన మూడు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసstar cricketer {#}Josh;Wife;Father;October;Cricketమరోసారి తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్.. సతీమణి ఫోటో వైరల్..మరోసారి తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్.. సతీమణి ఫోటో వైరల్..star cricketer {#}Josh;Wife;Father;October;CricketTue, 20 Aug 2024 19:54:00 GMT
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ త్వరలో రెండోసారి తండ్రి అవుతున్నారు. ఆయన భార్య బెక్కి బోస్టన్ సోషల్ మీడియాలో ఈ శుభవార్తను పంచుకున్నారు. తమ ఫ్యామిలీలో మరో చిన్న మెంబర్ చేరబోతున్నందున ఇంట్లో మరింత సందడిగా ఉండబోతుందని ఆమె తెలిపారు. 2020లో పాట్ కమ్మిన్స్, బెక్కి బోస్టన్ నిశ్చితార్థం చేసుకున్నారు. 2022, ఆగస్టులో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇప్పటికే ఆల్బీ అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఆల్బీ 2021 అక్టోబర్ 8న జన్మించాడు. తమ కుమారుడితో కలిసి తీసిన మూడు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ శుభవార్తను బెక్కి తెలిపారు.

"మేము మా సంతోషాన్ని మీతో పంచుకోవడం చాలా ఆనందిస్తున్నాము! త్వరలో మన కొత్త అతిథిని కలుసుకోవడానికి మేము ఆత్రంగా ఉన్నాము. మా జీవితంలో మరో చిన్న సభ్యుడు చేరడంతో మా ఇంటికి మరింత జోష్ వస్తుంది." అని తన బెక్కి సోషల్ మీడియాలో పోస్ట్ లో రాసింది.

పాట్ కమ్మిన్స్ తన గత 18 నెలల కాలంలో బ్రేక్ లేకుండా బౌలింగ్ వేస్తూ వస్తున్నాడు. అందుకే ఇప్పుడు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. త్వరలో భారతదేశంతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కి ముందు, ఆయన ఎనిమిది వారాల విరామం తీసుకున్నారు. "ఎవరైనా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత మరింత ఉత్సాహంగా ఆడతారు. నేను దాదాపు 18 నెలల క్రితం జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ నుంచి నాన్ స్టాప్ గా బౌలింగ్ వేస్తున్నాను. కాబట్టి, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం అని నేను భావిస్తున్నాను" అని కమ్మిన్స్ చెప్పారు.

"ఈ విశ్రాంతి వల్ల నేను 7 లేదా 8 వారాలు బౌలింగ్ వేయకుండా ఉండగలను. దీంతో నా శరీరం పూర్తిగా విశ్రాంతి పొందుతుంది. ఆ తర్వాత మళ్ళీ నెమ్మదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టవచ్చు. దీని వల్ల నేను ఎక్కువ కాలం బౌలింగ్ వేయగలను, నా బౌలింగ్ స్పీడ్‌ను నిలబెట్టుకోవడం సులభమవుతుంది. గాయాలు అయ్యే అవకాశం తగ్గుతుంది" అని కమ్మిన్స్ చెప్పారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>