PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/hyderabad-traffic959a6628-d8f7-4060-804a-02db10ad572c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/hyderabad-traffic959a6628-d8f7-4060-804a-02db10ad572c-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ లో నివసించడం ఎంతోమంది కల కాగా నగరంలో అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నప్పటికీ వర్షాలు పడిన సమయంలో మాత్రం నగరవాసులకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. చిన్న వర్షం వచ్చినా గంటలు గంటలు ట్రాఫిక్ లోనే చిక్కుకుని ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షం తగ్గిన తర్వాత కూడా రాకపోకలకు చాలా సమయం పడుతుండటంపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది.hyderabad traffic{#}Indira Gandhi;Varsham;Hyderabad;Revanth Reddy;police;Reddy;Government;CM;Traffic policeహైదరాబాద్ ట్రాఫిక్ పై ప్రజల అసహనం.. సీఎం ఆదేశాలు సైతం అమలు కావట్లేదా?హైదరాబాద్ ట్రాఫిక్ పై ప్రజల అసహనం.. సీఎం ఆదేశాలు సైతం అమలు కావట్లేదా?hyderabad traffic{#}Indira Gandhi;Varsham;Hyderabad;Revanth Reddy;police;Reddy;Government;CM;Traffic policeTue, 20 Aug 2024 11:46:00 GMTహైదరాబాద్ లో నివసించడం ఎంతోమంది కల కాగా నగరంలో అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నప్పటికీ వర్షాలు పడిన సమయంలో మాత్రం నగరవాసులకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. చిన్న వర్షం వచ్చినా గంటలు గంటలు ట్రాఫిక్ లోనే చిక్కుకుని ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షం తగ్గిన తర్వాత కూడా రాకపోకలకు చాలా సమయం పడుతుండటంపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది.
 
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు సైతం అమలు కావట్లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అరగంట ప్రయణానికి సైతం రెండు గంటల సమయం పడుతోందని ప్రజలు చెబుతున్నారు. నిన్న సెలవు దినం కావడంతో ట్రాఫిక్ పోలీసులు సైతం పూర్తిస్థాయిలో అందుబాటులో లేరని కామెంట్లు వినిపించాయి. గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ముఖ్యమైన కూడళ్ల దగ్గర పోలీసులు ఉండాలని సూచించారు.
 
అయితే ట్రాఫిక్ పోలీసులు వర్షాలు కురిసే సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా మరిన్ని ముందడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. మరోవైపు హైదరాబాద్ లో భారీ వర్షం వల్ల ఇందిరా నగరంలో ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు.
 
కుండపోత వర్షాల వల్ల హైదరాబాద్ నగర వాసులు ఇతర ప్రాంతాలకు వెళ్లడం విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ జామ్ అనే పేరు వింటే హైదరాబాద్ వాసులు భయపడాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో అయినా ఈ పరిస్థితి మారితే చాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ వల్ల 10 నిమిషాల దూరానికి సైతం 40 నిమిషాలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వాహనాల్లో వెళ్లే వాళ్ల కంటే నడుచుకుంటూ వెళ్లే వాళ్లే త్వరగా గమ్యానికి చేరుకుంటున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>